AIDS : సింగిల్ ఇంజక్షన్ తో ఎయిడ్స్ కు చెక్ ..క్యాన్సర్ కు కూడా ఇదే మందు

ఎన్నో మొండి వ్యాధులకు చెక్ పెట్టిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎయిడ్స్ కు కూడా ఇంజక్షన్ కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఇజ్రాయేల్ పరిశోధకులు ఎయిడ్స్‌ను నిరోధించే సరికొత్త చికిత్సపై చేపట్టిన ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నాయి. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను నేచుర్ అనే సైన్స్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించారు.


Published Jul 08, 2024 06:08:00 PM
postImages/2024-07-08/1720442388_1280x72066696x392.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎన్నో మొండి వ్యాధులకు చెక్ పెట్టిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎయిడ్స్ కు కూడా ఇంజక్షన్ కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఇజ్రాయేల్ పరిశోధకులు ఎయిడ్స్‌ను నిరోధించే సరికొత్త చికిత్సపై చేపట్టిన ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నాయి. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను నేచుర్ అనే సైన్స్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించారు.


దశాబ్దాల తరబడి మానవాళిని పీడిస్తున్న హెచ్‌ఐవీ (HIV)ని సమూలంగా అంతం చేసే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎయిడ్స్‌ (AIDS) కు కారణమయ్యే వైరస్‌ను జన్యుమార్పిడి రూపంలో తాము అభివృద్ధిచేసిన ఔషధం నాశనం చేస్తోందని టెల్ అవీవ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇంజక్షన్ రూపంలో సింగిల్ డోస్ ఇస్తే చాలు ఎయిడ్స్ ను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. పరిశోధన వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచుర్‌’లో ప్రచురించారు.


సాధారణంగా ఎముక మజ్జలో తయారయ్యే బి-కణాలుగా పేర్కొనే తెల్ల రక్తకణాలు పరిపక్వం చెంది తర్వాత రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. ఇది శరీరంలో బ్యాక్టీరియా , వైరస్ లతో ఫైట్ చేసేలా ఇమ్యూనిటీని  ప్రేరేపిస్తుంది. హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు బి-కణాలపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి.


ప్రస్తుతం ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి తెల్లరక్త కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. జన్యుమార్పిడిగి గురైన ఈ కణాలు.. శరీరంలో కణాలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయో..ఏ డిసీజ్ ను క్రియేట్ చేస్తున్నాయో దానికి తగినట్లుగా ఆ డిసీజ్ ను కంట్రోల్ చేసేలా పనిచేస్తుంది. దీని వల్ల హెచ్ ఐవీ సెల్స్ ని కంట్రోల్ చేసి యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా ఇమ్యూనిటీని ప్రేరేపిస్తుంది. వైరస్ ను నిర్వీర్యం చేయడమే ఈ ఇంజక్షన్ లక్ష్యం.


వైరస్‌ ప్రవర్తనను పసిగట్టి, తదనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకుంటాయి. తద్వారా హెచ్‌ఐవీని నిరోధించే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ‘‘సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ (CRISPR) అనే సాంకేతికత సహాయంతో టైప్‌-బి తెల్లరక్త కణాల జన్యువుల్లో మార్పులు చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ల్యాబ్ టెస్ట్ లో  ఈ వైరస్‌ను సమర్థంగా అడ్డుకునేలా రక్తంలో భారీగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి.. ఈ ప్రతినిరోధకాలు హెచ్‌ఐవీని అత్యంత సమర్థంగా అడ్డుకోగలవన్న నిర్ధారణకు వచ్చాం’’ అని తెలిపారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు అత్యంత సురక్షితమైనవి, సమర్థంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. జస్ట్ హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నివారణకే కాకుండా... కేన్సర్‌, రోగనిరోధక వ్యవస్థ స్వీయదాడి చేసుకునే ఆటోఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలోనూ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కరెక్ట్ గా వర్కవుట్ అయితే ..క్యాన్సర్ , ఎయిడ్స్ తో బాధపడుతున్న లక్షల మంది పేషెంట్లు దీని భారి నుంచి బయటపడతారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news hiv-aids

Related Articles