కీర్తి సురేష్ పై తరచుగా ఎఫైర్, మ్యారేజ్ రూమర్స్ వస్తుంటాయి. కీర్తి ఎవరో రెస్టారెంట్ ఓనర్ తో రిలేషన్ లో ఉందని, మ్యూజిక్ డైరక్టర్ తో ఎఫైర్ అని చాలా రూమర్స్ వచ్చాయి
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మాటలు వింటే సింగిల్స్ కు గుండె పగలిపోయి ఉంటుంది. ఓపెన్ గా నేను సింగిల్ కాదురా నాయనా...మాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నేను శైలజ... తో ఎంట్రీ ఇచ్చి ...తెలుగు ఆడియన్స్ ను ఫుల్ ఫిదా చేసేసింది. అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వచ్చినప్పటికీ మూవీ ఫ్లాప్...కాని అమ్మడుకు మంచి పేరే వచ్చింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. కాగా కీర్తి సురేష్ పై తరచుగా ఎఫైర్, మ్యారేజ్ రూమర్స్ వస్తుంటాయి. కీర్తి ఎవరో రెస్టారెంట్ ఓనర్ తో రిలేషన్ లో ఉందని, మ్యూజిక్ డైరక్టర్ తో ఎఫైర్ అని చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సింగిల్ కాదని కూడా చెప్పేసింది.
కాగా ఓ విలేకరు మీరు సింగిల్ కదా, లైఫ్ బోర్ కొట్టడం లేదా? అని ప్రశ్నించగా.... నేను సింగిల్ అని ఎవరు చెప్పారని కీర్తి సురేష్ షాకింగ్ ఆన్సర్ చెప్పింది. ఈ సందర్భంగా పెళ్లి అంటే కూడా ఏమిటో వివరించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనే వివాహం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
కెరీర్ బిగినింగ్ లో నాకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దాంతో నన్ను బాగా ట్రోల్ చేశారు. సదరు ట్రోల్స్ బాధకు గురి చేశాయి. మహానటి విజయం తర్వాత ట్రోల్స్ తగ్గాయి. కొందరు కావాలనే నాపై పుకార్లు పుట్టించారు. నెగిటివిటీని నేను పట్టించుకోను. కాలమే వాటికి సమాధానం చెబుతుందని, అంటు ఎమోషనల్ కూడా అయ్యింది. అసలు ఆ ట్రోలర్స్ కు బుధ్ది లేదు...ఇంత అందమైన అమ్మాయిని ఏడిపిస్తారా అంటున్నారు నెటిజన్లు.