తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో హీరోల బర్త్డేలు లేదంటే ఇతర స్పెషల్ ఈవెంట్లలో వారి పాత సినిమాలు రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో హీరోల బర్త్డేలు లేదంటే ఇతర స్పెషల్ ఈవెంట్లలో వారి పాత సినిమాలు రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి ఈ తరుణంలో పాత సినిమాల వల్ల కొత్తగా రిలీజ్ అయిన చిన్న హీరోల సినిమాలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తోంది.
అయితే ఈ నెలలో మాత్రం చాలావరకు అంటే అర డజన్ సినిమాలు మోస్తారు విజయంకూడా సాధించలేదు. కల్కి 40 రోజుల్లో ఒక్క సినిమాను కూడా ముందుకు రానివ్వలేదు. కల్కి సినిమా కాస్త డల్ అయిపోయిన ఈ వారం అరడజన్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే తరుణంలో ఒక పాత సినిమా ఈ కొత్త సినిమాలను దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇంతకీ ఆ చిత్రం ఏంటయ్యా అంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి. 2001లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్టు అందుకుంది. ఈ చిత్రాన్ని ఫోర్ కె ప్రింటుతో మరోసారి రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే విడుదలకముందే ఫ్రీ సేల్స్ లో రెండు కోట్ల వసూళ్లు చేసి రికార్డు నెలకొల్పింది.
దీని ముందు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అంటే ఇప్పుడు రిలీజ్ కి ముందున్నటువంటి కమిటీ కుర్రాళ్లు సినిమాను కూడా మురారి సినిమా దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి మురారి సినిమా కొత్త నటీనటులకు కష్టాలు తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు.