Manchu Vishnu: నా దృష్టిలో ప్రభాస్ అంత గొప్ప యాక్టరేం కాదు !

మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆయన షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


Published Apr 25, 2025 01:12:00 PM
postImages/2025-04-25/1745567080_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కన్నప్ప మూవీ తో మంచు విష్ణు చాలా బిజీగా గా ఉన్నాడు ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ టీం చాలా ఫాస్ట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆయన షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


మంచు విష్ణు మాట్లాడుతూ... "నా దృష్టిలో ప్ర‌భాస్ నార్మల్ యాక్ట‌ర్ మాత్ర‌మే. లెజెండ్ యాక్ట‌ర్ కాదు. ఆయ‌న లెజెండ్‌గా మార‌డానికి ఇంకా స‌మ‌యం పడుతుంది. నిజానికి మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్ . ఎందుకంటే కాలం ఆయన్ని లెజెండరీ యాక్టర్ ని చేసింది. ప్రభాస్ ప్రస్తుతానికి లెంజరీ యాక్టర్ కాదు. కాని రాబోయే రోజుల్లో మంచి సినిమాలు చేసి గ్రేట్ యాక్టర్ అవుతారని కామెంట్ చేశారు.


దీంతో విష్ణు చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోషల్ మీడియా లో వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్‌, నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. కన్నప్ప మూవీ హిట్ కొట్టాలంటే కొన్ని రోజులు మంచు విష్ణు మాట్లాడకపోవడమే మంచిదని కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారు. ఆయన తాలూకు పోస్టర్లు , వీడియోలు రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu manchu-vishnu

Related Articles