Maruthi Nagar Subramanyam Review:మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సూపర్ హిట్టేనా.?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు హీరోలుగా విలన్స్ గా, కామెడీ ఆర్టిస్టులుగా ఇలా ఎన్నో పాత్రలో నటిస్తూ ఉంటారు. ఆ విధంగానే సీనియర్ నటుడు రావు రమేష్ కూడా తొలిసారి ప్రధాన పాత్రలో నటించిన మూవీ


Published Aug 23, 2024 11:26:33 AM
postImages/2024-08-23/1724392593_raoramesh.jpg

 డైరెక్టర్ రచన స్క్రీన్ ప్లే: లక్ష్మణ్ కార్య 
 ప్రొడ్యూసర్: బుజ్జి రాయుడు, పెండ్యాల మోహన్ కార్యా 
 సంగీతం:కళ్యాణ్ నాయక్ 
 ఎడిటింగ్: బొంతల నాగేశ్వరరావు 
 సినిమాటోగ్రఫీ:ఎంఎన్ బాల్ రెడ్డి 

 సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు హీరోలుగా విలన్స్ గా, కామెడీ ఆర్టిస్టులుగా ఇలా ఎన్నో పాత్రలో నటిస్తూ ఉంటారు. ఆ విధంగానే సీనియర్ నటుడు రావు రమేష్ కూడా తొలిసారి ప్రధాన పాత్రలో నటించిన మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం.  మరి ఈ విధంగా మొదటి సారి ఆయన సినిమాలో ప్రధాన పాత్రలో చేశారు మరి ఆయన సక్సెస్ అందుకున్నారా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

 స్టోరీ:
 సుబ్రహ్మణ్యం ( రావు రమేష్) ఈయన మారుతి నగర్ లో నివాసం ఉంటాడు. చిన్నతనం నుంచే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనేది లక్ష్యం. ఆ లక్ష్యం వైపు వెళ్తున్న తరుణంలోనే వివాహం అవుతుంది. అతని భార్య రాణి  ( ఇంద్రజ)కు  ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. దీంతో భార్య చాటున భర్తల ఆయన బ్రతుకుతూ ఉంటారు.  ఇదే తరుణంలో రావు రమేష్ కు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా, కొంతమంది ఉద్యోగ పరీక్షల్లో   గందరగోళం జరిగిందని కేసు వేయడంతో, జాబ్ అపాయింట్మెంట్ రాదు. దీంతో భార్య సంపాదన మీదనే జీవితాన్ని గడుపుతాడు.  ఈ క్రమంలోనే వీరికి ఒక అబ్బాయి అర్జున్ ( అంకిత్) ఈయన కలల్లోనే మేడలు  కడతాడు. ఇలా వారి జీవితం గడుస్తున్న తరుణంలోనే సుబ్రహ్మణ్యం బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. అది ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు వేసారో తెలియదు. ఆ డబ్బును సుబ్రహ్మణ్యం కొద్దికొద్దిగా ఖర్చు పెడతాడు. ఈయన అకౌంట్లో 10 లక్షలు ఎవరు వేశారు.. లాస్ట్ కు సుబ్రహ్మణ్యంకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా లేదా అనేది మిగతా స్టోరీ చూస్తే అర్థమవుతుంది. 

 ఇక సినిమా టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ లక్ష్మణ్ కార్య  మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లైప్ సెటిల్ అవుతుందని భావిస్తారు. ఈ సున్నితమైన పాయింట్ చుట్టే కథ మొత్తం తిప్పాడు. అలాగే రావు రమేష్ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం 25ఏళ్ళు ఎదురు చూడడం అనే పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సాధారణంగా చదువుకున్న యువత గవర్నమెంట్ జాబ్ కోసం ఏ విధంగా కష్టపడతారు, గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఫ్యామిలీలు ఎలా లైఫ్ లీడ్ చేస్తారు.  జాబ్స్ వచ్చిన కోర్టులో కేసులు పడి సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు జాప్యం చేయడం వల్ల నిరుద్యోగులు ఎలా  నష్టపోతారు అనేది అద్భుతంగా చూపించగలిగాడు.  ఒక సామాన్య వ్యక్తికి 10లక్షలు ఉచితంగా వస్తే ఎలా ఫీలవుతారు అనేది కూడా ఇందులో చక్కగా చూపించాడు.  ఈ పాత్రకి  రావు రమేష్ తప్ప ఇంకా ఎవరు సెట్ కాదు అనే రేంజ్ లో నటించాడని చెప్పవచ్చు.

 మధ్య మధ్యలో వచ్చే ఎమోషన్స్ సీన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. ఇక సినిమా క్లైమాక్స్ ఊహించని ట్విస్టుతో ఉంది. అందరినీ ఆకట్టుకుంది. మధ్యలో రావు రమేష్ కుమారుడి ప్రేమ వ్యవహారం, అందులో కొన్ని ఫన్నీ యాంగిల్స్ ఉండడంతో ప్రేక్షకులకు బోర్ అనిపించదు. మొత్తానికి సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకేక్కించారని చెప్పవచ్చు. ఇందులో నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ మరింత ఆకట్టుకుందని చెప్పవచ్చు.

 నటీనటుల నటన విషయానికి వస్తే  రావు రమేష్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఎలాంటి ఎమోషనల్ పాత్రలైనా ఈజీగా మెప్పించగలరు. ఆయన హావభావాలు, డైలాగులు మరింత ఆకట్టుకున్నాయి. ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం భార్య పాత్రలో ఇంద్రజ ఎంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎలాంటి సంపాదన లేని మొగుడును  తిట్టిపోసే పాత్రలో ఇంద్రజ అద్భుతంగా నటించింది.  ఎవరికి పాత్ర పరిధిలో వారు అద్భుతంగా నటించారు.

 ప్లస్ పాయింట్స్ :
 స్టోరీ  
 రావు రమేష్ నటన
 క్లైమాక్స్ సీన్స్ 

 మైనస్ పాయింట్స్:
 ఎడిటింగ్ 
 రెండో భాగం బోరింగ్.

 మొత్తానికి సినిమా నవ్వించే ఎమోషనల్ డ్రామాగా సాగిందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu maruthi review maruthi-nagar-subramanyam rao-ramesh indraja ankith

Related Articles