పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి' అంటూ వ్యాక్యాలు చేసిన విజయ్ దేవరకొండ ను చిక్కుల్లో పడేశాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అయితే ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో '500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి' అంటూ వ్యాక్యాలు చేసిన విజయ్ దేవరకొండ ను చిక్కుల్లో పడేశాయి.
ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విజయ్.. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఉగ్రదాడిని ఖండించాడు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కశ్మీర్ లో దాడులు, విధ్వంసం సృష్టిస్తున్నారని కామెంట్స్ చేశాడు.
గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, అయితే ఇప్పటికే హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్. రీసెంట్ గా సూర్య నటించిన రెట్రో సినిమాల ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆదివాసీయులను అవమానించారంటూ పిర్యాధులో పేర్కొన్నారు లాయర్ లాల్ చౌహాన్ . విజయ్ తమకు క్షమాపణలు చెప్పాలని మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.