మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల పై మరో సారి ట్విట్ చేశారు. సుప్రీం కోర్టు ఏపీ గవర్నమెంట్ పై సీరియస్ కూడా అయ్యింది. దీని పై మరో సారి ట్వీట్ వేశారు ప్రకాశ్ రాజ్. దేవునికి రాజకీయ రంగులు పులమొద్దు..అంటూ ట్వీట్ చేశారు.తిరుమల పై సోమవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ..ఏపీ రాష్ట్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని టీటీడీ ఈవో చెప్పారు కదా..సో ఇప్పుడు తక్కువ క్వాలిటీ నెయ్యి వాడట్లేదు కదా..మరి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూపై మాట్లాడిన ప్రతి ఒక్కరిపై ఓ రేంజ్‌లో చిందులు తొక్కాడు. దీంతో శ్రీవారి లడ్డూ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పలుముకుంది. దీంతో అన్ని వర్గాల నుంచి ఎంత పాజిటివిటీ వచ్చిందో ...అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు అనేదే పాపం...కాని తెలిసినపుడు కోట్ల జనాలు సఫర్ అవుతారనిపించినపుడు బాధ్యత గల పౌరుడుగా జనాలను రెచ్చగొట్టే పనులు చెయ్యకూడదు.
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రెండో ఒపీనియన్ తీసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అనంతరం కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి’ అంటూ #జస్ట్ ఆస్కింగ్, #జస్ట్ ప్లీడింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.