ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలకు మారుతున్నటువంటి అలవాట్ల రీత్యా గర్భం దాల్చడం కష్టమవుతుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలు గర్భం దాల్చకపోవడానికి కారణాలు అది భార్యలో ఉండొచ్చు, లేదంటే భర్తలో ఉండొచ్చు. కానీ ప్రస్తుత కాలంలో గర్భం దాల్చడం అనేది చాలామంది స్త్రీలలో ఆలస్యం అవుతుంది. కొంతమందికి అస్సలు కావడం లేదు. దీనికి కొన్ని అలవాట్లే కారణమట. అలాంటి అలవాట్లు పెళ్లి కానీ అమ్మాయిలకు ఎవరికైనా ఉంటే మానుకోవాలని అంటున్నారు. అవేంటో చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలకు మారుతున్నటువంటి అలవాట్ల రీత్యా గర్భం దాల్చడం కష్టమవుతుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలు గర్భం దాల్చకపోవడానికి కారణాలు అది భార్యలో ఉండొచ్చు, లేదంటే భర్తలో ఉండొచ్చు. కానీ ప్రస్తుత కాలంలో గర్భం దాల్చడం అనేది చాలామంది స్త్రీలలో ఆలస్యం అవుతుంది. కొంతమందికి అస్సలు కావడం లేదు. దీనికి కొన్ని అలవాట్లే కారణమట. అలాంటి అలవాట్లు పెళ్లి కానీ అమ్మాయిలకు ఎవరికైనా ఉంటే మానుకోవాలని అంటున్నారు. అవేంటో చూద్దాం.
సంతానోత్పత్తి కలగడంలో ముఖ్యంగా మనం తినే ఫుడ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ బరువు పెరగడం లేదంటే బాగా సన్నగా ఉండడం వల్ల కూడా ఆండోత్సర్గం ప్రభావితమై పిల్లలు పుట్టారట. తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు చక్కెర కొవ్వు పదార్థాలు వంటివి తినడం వల్ల ఆండోత్సర్గం, గర్భాశయ సమస్యలు ఏర్పడతాయట. అంతేకాకుండా ప్రజెంట్ చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందే మధ్యపానం, ధూమపానానికి అలవాటు పడుతున్నారు.
వారి సంతాన ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ధూమపానం ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గించి వారికి సంతానం కలగకుండా చేస్తుందట. ఇక ఇవే కాకుండా ఒత్తిడి హార్మోన్లు కూడా సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతాయని ఒత్తిడి వల్ల ఆండోత్సర్గం ఆలస్యం అవుతుందని అంటున్నారు. కొంతమంది మహిళల్లో గర్భాశయం లోని పొర సన్నగా అవ్వడం వల్ల పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుందట. అంతేకాకుండా క్రమరహిత రుతుచక్రం కూడా పెళ్లి తర్వాత తల్లి కాకుండా చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.