cancer: పురుషుల్లో ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ?

సెప్టెంబర్ నెలను ప్రొస్టేట్ క్యాన్సర్ నెలగా ప్రకటించారు. పైగా దాని తీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. 


Published Sep 30, 2024 12:21:00 PM
postImages/2024-09-30/1727679135_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రొస్టేట్ క్యాన్సర్ పూర్తిగా మగవారి సంబంధిత వ్యాధి . నిజానికి ప్రాణాంతక వ్యాధి కూడా. ఈ మధ్య కాలంలో ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా ఎక్కువైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 50 ఏళ్ల లోపు వయస్సున్న వారు ఈ పౌరుష గ్రంధి క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు.దీని కారణంగా సెప్టెంబర్ నెలను ప్రొస్టేట్ క్యాన్సర్ నెలగా ప్రకటించారు. పైగా దాని తీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. 


మిగిలిన వాటితో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తుంది. నిజానికి పోస్టేట్ కాన్సర్ వస్తే దాదాపు మనిషి పని అంతం చేసేస్తుంది. ఎప్పుడైతే మూత్రసంబంధిత వ్యాధులు వస్తాయో మనిషిచాలా ఇబ్బందిపడిపోతాడు. ఇది ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీలలో నివసించే 35 నుండి 44 మధ్య ఏజ్ ఉన్న వారిలో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని..  క్లియర్ గా తెలిపింది ప్రపంచ ఆరోగ్యసంస్థ. అయితే 2022 నుంచి భారత్ లో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అందులో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువున్నాయి.


తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య ఉండదు. అమెరికాలో 80 శాతం మంది బాధితులు తొలి దశలోనే చికిత్సకు వస్తున్నారని.. భారత్ లో మాత్రం వ్యాధి ముదిరిన తర్వాత వస్తున్నారు అందుకే క్యాన్సర్ ను భారత్ లో ప్రమాదకరవ్యాధిగా పరిగణించవల్సి వస్తుందంటున్నారు డాక్టర్లు. 


అసలు ఈ వ్యాధి లక్షణాలేంటో చూద్దాం..


* పౌరుష గ్రంధి క్యాన్సర్ పురుషులలోను, వృద్ధులలో అత్యధికంగా పౌరుష గ్రంధికి వచ్చే క్యాన్సర్..

 
* మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉండటం.. రాత్రి పదే పదే లేవాల్సి రావటం, 


*మూత్రంలో రక్తం పడటం, నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి ఉండటం ప్రోస్టేట్ క్యాన్సర్ కు సూచనలని వైద్యులు చెబుతున్నారు.


* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలి..

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news cancer healthy-food

Related Articles