అలా వెళ్లున్నపుడు గుంటులో ఉన్న దుగ్గిరాల వచ్చారట. నాటకాలు ఆడేందుకు అక్కడకొచ్చిన సావిత్రి జమున వారింట్లో ఉండేది. అప్పటి నుంచి జమున తో మంచి స్నేహం ఉండేది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జమున , సావిత్రి అందరు ఇండస్ట్రీ లో ఫ్రెండ్స్ అనుకుంటారంతా. కాని కాదని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇండస్ట్రీలో కాదు ..సావిత్రి స్టేజ్ ఆర్టిస్ట్ ..హీరోయిన్ కాకముందు నాటకాలు ఆడేవారు. అలా నాటకాలు ఆడుతున్నపుడు చాలా ప్రాంతాల్లో తిరిగేవారు. అలా వెళ్లున్నపుడు గుంటులో ఉన్న దుగ్గిరాల వచ్చారట. నాటకాలు ఆడేందుకు అక్కడకొచ్చిన సావిత్రి జమున వారింట్లో ఉండేది. అప్పటి నుంచి జమున తో మంచి స్నేహం ఉండేది.
అనంతరం సావిత్రి మద్రాస్ వెళ్లారు. పాతాళ భైరవి సినిమాలో తళుక్కున మెరిసింది. సావిత్రి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన మొదటి చిత్రం అదే. దేవదాసు. అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి జంటగా నటించిన ఈ ట్రాజిక్ లవ్ డ్రామా భారీ విజయం . ఇలా అదృష్టం వరించింది. తర్వాత తర్వాత జమున కూడా హీరోయిన్ అయ్యింది. సావిత్రే జమునను తీసుకొచ్చిందని అంటారు. ఈ విషయాన్ని జమున పేరెంట్స్ చెప్పి సావిత్రి ఒప్పించిందట
జమునకు కూడా నటన పట్ల మక్కువ ఉంది. నటనతో ఇండస్ట్రీలో ఎంతో ఎదిగింది. మిస్సమ్మలో జమున అమాయకపు పల్లెటూరి జమిందారు కూతురు పాత్రలో మెప్పించింది. ఇక మిస్సమ్మ సినిమా సూపర్ డూపర్ హిట్టు. ఇక వీరిద్దరి మధ్య ఎంతో అభిమానం ఉండేది. జమున పెళ్లి కూడా సావిత్రి అన్నీ తానై చేసింది. కాని లాస్ట్ లో ఎందుకో కాస్త ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి.
దీనికి కారణం రమాప్రభే అని చాలామంది అంటుంటారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కాని జమున , సావిత్ర మధ్య రమాప్రభ లేనిపోనివి చాఢీలు చెప్పి ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసిందని అంటుంటారు. ఇండస్ట్రీ లో చాలా మంది ఈ విషయాన్ని గుసగుసలాగానే మాట్లాడుకున్నారని పాత యాక్టర్స్ చెబుతుండేవారు. ఏడాది పాటు మాట్లాడుకో లేదట. అనంతరం ఇద్దరికీ అసలు విషయం తెలిసిందట. సావిత్రి, జమున మరలా దగ్గరయ్యారట. యధావిధిగా మాట్లాడుకున్నారట.