తాబేలు మాత్రం ..వెనక్కి కూడా చూడకుండా తన నడక ను కంటిన్యూ చేస్తూనే ఉంది. చివరికి ఆఖరి లైన్ కూడా క్రాస్ అయిపోయింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అడవిలో అన్ని జంతువులలోను ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.అలాగే కుందేలు కు ఓ ప్రత్యేకత ఉంటే తాబేలు కు మరో ప్రత్యేకత. అయితే మనం నీతి కథల్లో చాలా సార్లు ఈ కుందేలు..తాబేలు కధ వినే ఉంటాం కదా..కుందేలు ఎప్పుడు తాబేలుని ఎగతాళి చేసేది పరిగెత్తడం తనకు రాదనీ నన్ను ఎప్పటికి నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది. ఇదంతా రోజు విని విని విసుగెత్తిన తాబేలు ఓ రోజు పందెం వేద్దాం వస్తావా అని అడిగింది.
అది విని నవ్విన “కుందేలు ఎలాగూ నేనే గెలుస్తాను..ఏం పందెం అని అడిగిందట. అప్పుడు నాతో పరిగెత్తి గెలువు అందట. పరిగెత్తడం చేతకాని నువ్వు ఎలా పందెం కాస్తున్నావ్ “అని నవ్వింది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఎవరు గెలుస్తారు ..ఏంటి తాబేలు కు బుర్ర లేదా ఇలాంటి పందెం వేసిందని.
కుందేలు మరియు తాబేలు తమ పందేన్ని ప్రారంభించాయి. కాసేపటి తరువాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది.
తాబేలు అసలు కనబడలేదు. తాబేలు అసలే ..నిదానం ..వచ్చే సరికి చాలా టైం పడుతుంది. పరిగెత్తి పరిగెత్తి చాలా అలిసిపోయాను. అని ఓ కునుకు తీసింది. తాబేలు మాత్రం ..వెనక్కి కూడా చూడకుండా తన నడక ను కంటిన్యూ చేస్తూనే ఉంది. చివరికి ఆఖరి లైన్ కూడా క్రాస్ అయిపోయింది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ తాబేలు విజయాన్ని చూసి గట్టిగ అరవసాగాయి”.ఆ అరుపులతో కుందేలు లేచి పరిగెత్తడం ప్రారంభించింది “కానీ ఆలస్యమైంది తాబేలు పందెంలో గెలిచింది”. ఇదే కథ కు వాస్తవ రూపం ఈ వీడియో ఓ లుక్కేసేయండి.
నీతి: ఎవరిని తక్కువ చూడకూడదు..ఎవరి శక్తి వారికి ఉంటుంది.
నీకు శక్తినంత కూడగట్టుకొని కష్టపడు...కుదిరితే పరుగెత్తు..వల్ల కాకపోతే నడువు..మరీ కుదరకపోతే పాకు కాని ఆగిపోకు..నీ లక్ష్యం కోసం నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండు . చివరి నీ లక్ష్యాన్ని చేరుకుంటావు.
The fable of the rabbit and the tortoise has been tested in real life.
Tags : newslinetelugu socialmedia moral-story