Harsha sai: విదేశాలకు పారిపోయిన హర్షాసాయి !

హర్షాసాయి మాత్రం తన తప్పు లేదని ...తనపై అన్యాయం గా కేసు వేసిందని చెబుతూ రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నాడు.


Published Sep 30, 2024 02:36:00 PM
postImages/2024-09-30/1727687241_CASEFILEDAGAINSTYOUTUBERHARSHASAI.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : హర్షాసాయి పై అత్యాచారం కేసు నమోదయ్యిందని తెలిసిందే . అయితే తన నిజాయితీని కోర్టులో తేల్చుకుంటామని చెప్పాడు హర్షాసాయి.  కాని సారు ఇప్పుడు కనిపించడం లేదు..ఆయన ఒక్కడే కాదు...వాళ్ల నాన్న కూడా కనిపించడం లేదు. హర్షా సాయి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. కాని హర్షాసాయి మాత్రం తన తప్పు లేదని ...తనపై అన్యాయం గా కేసు వేసిందని చెబుతూ రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నాడు.


రీసెంట్‌గా సైబరాబాద్ సీపీని కలిసిన బాధితురాలు హర్షసాయికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందించింది. అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానం కూడా వ్యక్తం చేసింది. హర్షాసాయి మాత్రం తనను బాధితురాలే వేధిస్తుందని డబ్బులు డిమాండ్ చేసిందని తన దగ్గర లేదని చెప్తున్నందుకే ఈ కేసు వేసిందని లాయర్ తెలిపారు.


ఓ సినిమా కూడా మొదలు పెట్టాడు. హర్ష సాయి హీరోగా మెగా అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. కాని సినిమా రిలీజ్ చెయ్యలేదు. ఈ సినిమా కో ప్రొడ్యూసరే ఇప్పుడు కేసు పెట్టింది. హర్షాసాయి పరారీ పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu youtuber

Related Articles