Navaratri 2024: నవరాత్రుల్లో మీ కష్టాలు తర్చే మంత్రం ..నిష్టతో చదవండి!

దుర్గా చాలీసా చదివితే కష్టాలు తీరుతాయని ప్రతీతి. కాని దుర్గా పారాయణం చదవాలంటే మాత్రం కొన్ని నియమాలు కావాలి.


Published Sep 30, 2024 04:43:00 PM
postImages/2024-09-30/1727694863_durgamaa1.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను నవదుర్గలుగా పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మను శక్తి కొలది పూజిస్తే కష్టాలన్నీ తీరుస్తుంది.భక్తులు దుర్గా సప్తశతి, దుర్గా చాలీసాను కూడా పారాయణం చేస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గా చాలీసా చదివితే కష్టాలు తీరుతాయని ప్రతీతి. కాని దుర్గా పారాయణం చదవాలంటే మాత్రం కొన్ని నియమాలు కావాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా పారాయణం చేయడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.


* అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12.19 గంటలకు మొదలవుతుంది. ఈ నవరాత్రులు పండుగ అక్టోబర్ 12వ తేదీ, 2024 శనివారం ముగుస్తుంది. అయితే ప్రతి రోజు దుర్గా చాలీసా చదవడం వల్ల కుటుంబ సమసయలు తగ్గుతాయి. చిన్న నియమాలు పాటిస్తే ఫలితం బాగుంటుందని పురాణాలు చెబుతున్నాయి.


*దుర్గా దేవికి ఎరుపు రంగు ధరించి పూజ చెయ్యండి. మీలో దుర్గామాత ఉందని నమ్మండి.ఎర్రని వస్త్రాలు ..చక్కగా వేసుకొండి.


*దుర్గాదేవి విగ్రహానికి పువ్వులు, కుంకుమ, పసుపు, దీపం, పాలు, ప్రసాదం సమర్పించండి.


*దుర్గాదేవి చాలీసా చదివి..ప్రసాదం సమర్పించి ..మీరు తీసుకొండి.


*దుర్గా చాలీసా వల్ల మీకు కష్టాలు తగ్గుతాయంటే ..మానసిక ప్రశాంతత కలుగుతుంది.


*దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా చదవడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది.


*దుర్గా చాలీసా చదవడం వల్ల పోయిన ఆస్తులు తిరిగి వస్తాయి. మానసిక, ఆరోగ్యం కలుగుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu navaratri durgadevi-navaratri

Related Articles