Revanth Reddy : భూమిపూజలో అపచారం.. రేవంత్ చేతులతో తల్లికి ఇష్టం లేదా?

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండితులు వేదమంత్రాలు చదువుతుండగా గుమ్మడికాయ కొట్టాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గుమ్మడికాయ కొట్టే క్రమంలో అది చేతిలోంచి జారి కింద పడిపోయింది. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Published Aug 28, 2024 03:42:18 PM
postImages/2024-08-28/1724839938_Gummadikaya.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేకే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో జరిగిన భూమిపూజలో అపచారం చోటు చేసుకుంది.

రాష్ట్ర సచివాలయం ముందు గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించింది. అయితే.. అంతలోనే ఎన్నికలు రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై విమర్శలు వచ్చాయి. దీంతో తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండితులు వేదమంత్రాలు చదువుతుండగా గుమ్మడికాయ కొట్టాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గుమ్మడికాయ కొట్టే క్రమంలో అది చేతిలోంచి జారి కింద పడిపోయింది. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ద్రోహి, ఉద్యమ సమయంలో ఉద్యమకారులపైకి రైఫిల్ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరగడం తెలంగాణ తల్లికి ఇష్టం లేదేమో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ గడ్డకు, రాష్ట్రం కోసం అమరులైన బిడ్డల ప్రాణాలను అవహేళన చేసిన వ్యక్తి చేతుల మీదుగా తన విగ్రహం పెట్టించుకునేందుకు తెలంగాణ తల్లి విముఖత చూపింది అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు తెలంగాణవాదులు.

 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news revanth-reddy newslinetelugu cm-revanth-reddy telangana-government latest-news rajivgandhi telanganathallistatue

Related Articles