ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన కథానాయకలలో రాధిక కూడా ఒకరు. జయప్రద, జయసుధ, తరం హీరోయిన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి రాధిక తాజాగా ఇండస్ట్రీలో
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన కథానాయకలలో రాధిక కూడా ఒకరు. జయప్రద, జయసుధ, తరం హీరోయిన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి రాధిక తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కునే సమస్యలపై మాట్లాడారు. నటి హేమ కమిటీ రిపోర్ట్ పై ఆమె కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా ఈ పరిస్థితి అనేక ఇండస్ట్రీల్లో ఉందని ఆమె చెప్పుకొచ్చారు. నటీనటులను కమిట్మెంట్లు అడగడమే కాకుండా వాళ్లు బట్టలు మార్చుకునే కారవాన్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టేవారని, వారి నగ్న వీడియోలను చిత్రీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆమె ఆరోపణ చేశారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో స్త్రీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం దురదృష్టకరమని అన్నారు. 46 ఏండ్ల నుంచి నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని, ఏ ఇండస్ట్రీలో చూసిన మహిళలకు ఇలాంటి సమస్యలు తప్పక ఎదురవుతున్నాయని తెలిపారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో కేరళ వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న ఘటన నాకు ఇప్పటికీ గుర్తుందని, నేను షూట్ ముగించుకొని వెళ్తున్న సమయంలో సెట్ లో ఉండే కొంతమంది మగవాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఫోన్ ఏదో చూస్తూ నవ్వుకున్నారని అన్నారు. నాకు కాస్త డౌట్ వచ్చి అందులో ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని అడగగా కార్వాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు, చిత్రీకరించి ఫోన్లో చూస్తున్నారని ఆ వ్యక్తి చెప్పాడని ఆమె తెలియజేసింది.
అప్పుడే నేను చిత్ర బృందాన్ని పిలిచి ఫిర్యాదు చేశానని తెలియజేసింది. ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటినుంచి కార్వాన్ యూస్ చేయాలంటే నేను భయపడుతున్నానని, కనీసం దుస్తులు మార్చుకోవాలంటే కూడా నేను హోటల్ కి వెళ్తానని ఎలాంటి పని చేయాలన్న నేను దగ్గరలో ఉన్న హోటల్ తప్పనిసరిగా చూసుకుంటానని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.