ఒకేరోజు అత్యధికంగా 40 సెం.మీ వర్షం కురిసిందని ఆయన తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ సమీక్షలో పాల్గొన్నారు. వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి వివరించారు. ఒకేరోజు అత్యధికంగా 40 సెం.మీ వర్షం కురిసిందని ఆయన తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.
రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తి దెబ్బతిన్నాయని రేవంత్ వెల్లడించారు. తీవ్ర పంట నష్టం జరిగిందని కేంద్రమంత్రికి తెలిపారు. వరద నష్టం రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని.. ఒకే తీరుగా చూడాలని కేంద్రమంత్రిని రేవంత్ కోరారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా.. తెలంగాణకూ సాయం అందించాలని రేవంత్ కోరారు.