RICE: రాత్రి మిగిలిన అన్నంతోను మంచూరియా చెయ్యొచ్చు !

రాత్రి మిగిలిన అన్నంతో టేస్టీ టేస్టీ మంచూరియా చేసి చూద్దాం. ఎందుకు తినరు పిల్లలు. వాళ్లకి కావాల్సింది అదే కదా


Published Oct 06, 2024 07:54:00 PM
postImages/2024-10-06/1728224736_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఇప్పుడంతా బయటఫుడ్డే తింటున్నారు. మరి ఎంత టేస్టీ గా చేసినా..ఎంత కొత్తగా చేసినా జంక్ ఫుడ్ కే ఓటు వేస్తున్నారు పిల్లలు. అయితే రాత్రి మిగిలిన అన్నంతో టేస్టీ టేస్టీ మంచూరియా చేసి చూద్దాం. ఎందుకు తినరు పిల్లలు. వాళ్లకి కావాల్సింది అదే కదా.. మంచూరియాలు, పిజ్జాలు , బర్గర్లు ఇవే కదా  కావాల్సింది.
కొందరు మహిళలు మిగిలిన అన్నంతో వడియాలు లాంటి ఇతర పదార్థాలు చేసుకుంటారు. కానీ ఇలా చేయాలంటే కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుంది. అసలు ఇవి ఎలా చేస్తారో చూద్దాం రండి.


ఒక కప్పు అన్నం


ఒక ఉల్లిపాయ ముక్కలు


రెండు పచ్చిమిరపకాయలు


ఒక క్యాప్సికం ముక్కలు


ఒక క్యారెట్ తరుగు


రుచికి సరిపడా ఉప్పు


ఒక టీ స్పూన్ కారం


అర టీ స్పూన్ ధనియాల పొడి


పావు టీ స్పూన్ జీలకర్ర పొడి


అర కప్పు మైదా పిండి


అర చెక్క నిమ్మరసం


5 వెల్లుల్లి రెబ్బలు


ఒక పచ్చిమిరపకాయ ముక్కలు


ఒక ఉల్లిపాయ ముక్కలు


ఒక క్యాప్సికం ముక్కలు


ఒక క్యారెట్ తరుగు


ఒక టమాటా ముక్కలు


రుచికి సరిపడా ఉప్పు


అర టీ స్పూన్ కారం


అర టీ స్పూన్ గరం మసాలా


అర టీ స్పూన్ ఛాట్ మసాలా


4 టీ స్పూన్ల టమాటా కెచప్


ఇలా తయారుచేస్తే సరి ..
అన్నం మెత్తగా ముద్ద చేసుకొని పెట్టుకొండి .. అందులో క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. మీకు కావాల్సిన స్పెసెస్ అన్నీ వేసుకొండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె పెట్టుకుని ఆ మిశ్రమాన్ని గుండ్రంగా బంతుల్లాగా చేసుకోవాలి. కాస్త డీప్ ప్రై చేసుకొని పక్కన పెట్టుకొండి.


ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేరే పాన్ లో వేయించుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ హై ప్లేమ్ లో ప్రై చేసుకొండి. ఇవన్నీ వేగాక టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఉడించుకోవాలి. ఇందులో షెజ్వాన్ సాస్ , టమాటా , కాస్త రెడ్ చిల్లీ కెచప్ వేసి ఈ రైస్ బాల్స్ వేసుకొని దించేయండి, మీ రైస్ మంచూరియా రెడీ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu healthy-food-habits junk-food

Related Articles