ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లని ఎక్కువగా వాడుతున్నారు. ఒక్కో బాటిల్ ని కొన్న తర్వాత నెలల తరబడి వాడుతూ ఉంటారు. వాటిని కనీసం క్లీన్ కూడా చేయరు. వాటర్ బాటిలే కదా శుభ్రంగానే ఉంటుందని, చాలా మంది భావిస్తారు. కానీ అదే ప్రమాదం తెచ్చిపెడుతుందట. ఒక టాయిలెట్ లో ఉండే క్రిముల కంటే వాటర్ బాటిల్ లో ఉండేటువంటి క్రిములే ఎక్కువగా ఉంటాయని ఒక అధ్యాయం తెలిసింది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువగా వాటర్ బాటిల్ లో 40 వేల రేట్లు బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లని ఎక్కువగా వాడుతున్నారు. ఒక్కో బాటిల్ ని కొన్న తర్వాత నెలల తరబడి వాడుతూ ఉంటారు. వాటిని కనీసం క్లీన్ కూడా చేయరు. వాటర్ బాటిలే కదా శుభ్రంగానే ఉంటుందని, చాలా మంది భావిస్తారు. కానీ అదే ప్రమాదం తెచ్చిపెడుతుందట. ఒక టాయిలెట్ లో ఉండే క్రిముల కంటే వాటర్ బాటిల్ లో ఉండేటువంటి క్రిములే ఎక్కువగా ఉంటాయని ఒక అధ్యాయం తెలిసింది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువగా వాటర్ బాటిల్ లో 40 వేల రేట్లు బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
అమెరికాలోని వాటర్ ఫిల్టర్ గురు అనే స్పెషలిస్టు వాటర్ క్వాలిటీ కంట్రోల్ కంపెనీ ద్వారా ఒక అధ్యయనం చేసింది. రీ యూస్ చేసే మంచినీటి వాటర్ బాటిల్ పై దాదాపు 2.8 కోట్ల కాలనీ ఫార్మింగ్ యూనిట్ల సూక్ష్మజీవులు ఉండవచ్చని అధ్యయనంలో తేలింది. అయితే చైనా దేశంలోని హేనాన్ యూనివర్సిటీ నిపునులు ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.
సాధారణంగా ఒక్కో మిల్లీలీటర్ నీటిలో సగటున 75 వేల బ్యాక్టీరియా ఉంటుందని ఈ ప్రొఫెసర్లు అంచనా వేశారు. ఈ సర్వేను 90 మంది వాటర్ బాటిల్ వాడే వారిపై నిర్వహించారు. 15% మంది వాటర్ బాటిల్ నీటిని ఖాళీ చేసి దాన్ని పడేయకుండా మళ్ళీ నీటిని నింపి వాడుతున్నట్లు వారు గుర్తించారు. ఇందులో కొంతమంది బాటిల్ ను రోజుకు ఒక్కసారైనా శుభ్రం చేస్తామని, మరి కొంతమంది వారానికి రెండుసార్లు శుభ్రం చేస్తామని. ఇంకొంతమంది నెలకు రెండు సార్లు శుభ్రం చేస్తామని తెలియజేశారు.
దీన్ని బట్టి చూస్తే మాత్రం వాటర్ బాటిళ్లలో బ్యాక్టీరియా అనేది విపరీతంగా చేరిపోతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా మీరు వాటర్ బాటిల్ ని తాగడానికి మీ నోటి దగ్గర పెట్టుకుంటారు. ఆ టైంలో పెదవులు, చర్మం, చిగుళ్ళు, దంతాలు నాలుక ద్వారా సూక్ష్మజీవులు బాటిల్ లోకి చేరుతాయి. ఇవి క్రమంగా వృద్ధి చెందుతాయట. అలాగే మనం ప్రతిరోజు టాయిలెట్ కి వెళ్తాం, ఇతర వస్తువులను ముట్టుకుంటాం, లిఫ్టు బటన్లు ముట్టుకుంటాం. రకరకాల వస్తువులను తాకుతాం.
ఆ సమయంలో డైరెక్టుగా వచ్చి వాటర్ బాటిల్ మూత తీసి వాటర్ తాగుతూ ఉంటాం. ఈ సమయంలో బ్యాక్టీరియాలన్ని బాటిల్ లోకి చేరిపోతాయట. అభివృద్ధి చెంది మన ఆరోగ్యానికి హాని చేస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మరి వాటర్ బాటిల్ వాడేటప్పుడు తప్పకుండా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని, లేదంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.