gold: మరింత తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు పండగే

పెళ్లిళ్ల సీజన్ , బంగారం ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూసే. ఇవాళ బంగారం రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.


Published Aug 12, 2024 06:24:00 AM
postImages/2024-08-12/1723424092_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెళ్లిళ్ల సీజన్ , బంగారం ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూసే. ఇవాళ బంగారం రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. అది పెద్ద మార్పు ఏం కాదు . కేవలం రూపాయి తగ్గి ..24 క్యారట్ల బంగారం 7030 రూపాయిలుగా నమోదయ్యాయి. 22 క్యారట్ల బంగారం అయితే 6444 రూపాయిలు గా ఉంది.


హైదరాబాద్‌లో బంగారం రేట్లు


హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 10 గ్రాములు 70,030 గా నమోదయ్యింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల తయారీ గోల్డ్ రేటు 64,440 గా నమోదయ్యింది. 


రూ.100 తగ్గిన వెండి ధర
పసిడి ధర గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 4500 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ స్వల్పంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా రూ.1500 పెరిగి.. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 88 వేల వద్దకు ఎగబాకింది. కాని ఈ రోజు వెండి రేటు మరో వంద తగ్గి ...87900 గా ఉంది. ఇక ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు రూ. 88 వేల స్థాయికి చేరింది. అయితే జీఎస్టీ సహా స్థానిక పన్నులు కలిపితే పైన పేర్కొన్న ధరల్లో తేడా ఉంటుంది. బంగారం , వెండి సాయంత్రం వరకు మార్పులు జరుగుతుూనే ఉంటుంది. కాబట్టి కొనేటపుడు చూసుకొని ..కొంటే సరిపోతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles