మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ దేశంలో ఎన్నో పండుగలు, ఎన్నో వ్రతాలు రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. అలాంటి వరలక్ష్మీ వ్రతం రోజున
న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ దేశంలో ఎన్నో పండుగలు, ఎన్నో వ్రతాలు రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. అలాంటి వరలక్ష్మీ వ్రతం రోజున మనం ఎలాంటి నియమాలు పాటించాలి. ఎలాంటి తప్పులు చేయకూడదు. అనే వివరాలు చూద్దాం..
ఎలా పూజించాలి:
లక్ష్మీదేవిని తలంటు స్నానం చేసి ఉపవాస దీక్ష తీసుకుని, షోడాఫోపచారాలతో పూజించాలి. ఇందులో ముఖ్యంగా తొమ్మిది ముడులు ఉన్నటువంటి 9 పోగుల తోరణం కట్టుకోవాలి. అంతేకాకుండా లక్ష్మీదేవి తల్లికి వడపప్పు, అరటి పండ్లు, కొబ్బరికాయ, పానకం, నివేదనగా సమర్పించాలి. ఇక ఇవే కాకుండా బెల్లంతో చేసిన పదార్థాలు తల్లికి పెడితే చాలా ఆనంద పడుతుందట.
విశిష్టత:
మగధ దేశంలోని కుండిన మానే నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ మహిళ ఉండేదట. ఆమె ఉన్నంతలోనే ఆనందపడుతూ అత్తమామలను భక్తితో సేవించుకుంటూ బ్రతికేదట. ఆమె ప్రవర్తనను గుర్తించినటువంటి వరలక్ష్మి దేవి కలలో కనిపించి, నేను వరలక్ష్మిదేవి తల్లిని నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నానని చెప్పిందట. అంతేకాదు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తను పూజిస్తే సకల ఆనందాలు ప్రసాదిస్తానని తెలియజేసిందట. దీంతో చారుమతి కూడా సంతోషించి తల్లికి నమస్కరించి సెలవు తీసుకుందట. కలలో కనిపించి ఏదైతే చెప్పిందో ఆ విధంగానే ఆ స్త్రీ మిగతా స్త్రీలు అందరితో కలిసి ఈ పూజ జరిపించిందట. ఆ పూజ చేసిన వారందరి ఇంట్లో సకల సౌకర్యాలు ఆనందాలు వెల్లివిరిసాయట.
చేయకూడని తప్పులు:
తలంటు స్నానం చేయకుండా వరలక్ష్మీ వ్రతం చేయరాదు.
ఈ వ్రతం చేసే సమయంలో మాంసాహారాలు లాంటివి తినరాదు.
వరలక్ష్మీ వ్రతం చేసేవారు కలశాన్ని గాజు ప్లేట్ లో పెట్టకూడదట.
ఈ వ్రతం ఆచరించేవారు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదట.
వరలక్ష్మీ వ్రతం రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది.
వ్రతానికి ముందే గణేషుడిని పూజించాలి.