CRICKET : ఇక పై క్రికెట్ కూడా స్కూల్ లో ఓ సిలబస్..నేర్చుకోవల్సిందే !

 ఖచ్చితంగా క్రికెట్ ను అందరు పిల్లలు నేర్చుకోవల్సిందే.మన దేశంలో కాదు ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్‌ లో ఈ పధ్ధతి మొదలుపెట్టారు.


Published Aug 22, 2024 03:13:00 PM
postImages/2024-08-22/1724319819_indwon.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో గేమ్స్ ఉండడం చాలా కామన్. పాఠ్యపుస్తకాల్లో ఒక లెసన్ గా ఉంటుంది.కానీ క్రికెట్ ను ఏకంగా ఓ సబ్జెక్ట్ గా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఇష్ట ఉన్నవాళ్లు నేర్చుకోవచ్చు. ఇష్టం లేనవాళ్లు లైట్ తీసుకోవచ్చు. కాని ఇక పై అలా కుదరదు. ఖచ్చితంగా క్రికెట్ ను అందరు పిల్లలు నేర్చుకోవల్సిందే.మన దేశంలో కాదు ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్‌ లో ఈ పధ్ధతి మొదలుపెట్టారు.


అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన ఘనత ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్లకు దక్కుతుంది. 1877లో ఈ రెండు జట్లు తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాయి. అయితే.. 2027తో ఈ రెండు జట్లు తొలి టెస్ట్‌ ఆడి 150 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాయి. ఈ 150 ఏళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్ ఎంతో ఎదిగింది. ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా మంచి టీం. ఇది కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడున్న పిల్లలకి క్రికెట్ గురించి తెలియాలనే ఇలా చేసిందట.


6 వన్డే వరల్డ్‌ కప్‌లు, ఒక టీ20 వరల్డ్‌ కప్‌, ఒక డబ్య్లూటీసీ కప్‌ను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మోస్త్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా ఉంది. క్రికెట్‌ను ఒక ఫార్మాల్‌ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టి.. 9, 10వ తరగతి వి​ద్యార్థులకు మ్యాచ్‌లు కూడా నిర్వహించనున్నారు. ఇవి పరీక్షల్లాగా...మంచి స్కోర్ ఉన్నవారిని టీంలో కాస్త పుష్ చేస్తారు.  క్రికెట్ లో జస్ట్ బ్యాటింగ్ ఒక్కటే కాదు .. అంపైరింగ్‌, కోచింగ్‌, ఆటగాళ్లకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడం ఇలా క్రికెట్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఆ సబ్జెక్ట్‌లో ఉంటాయి. మొదలుపెట్టడం సరే...చివరికి ఏం జరుగుతుంది. కొత్త వారు దొరుకుతారా..శుభం లేదంటే ప్రభుత్వానికి అదనపు ఖర్చు తప్పదు.


 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu school cricket

Related Articles