mirai: మిరాయ్ సినిమాకు ఫస్ట్ నో చెప్పిన టాప్ హీరో ఎవరో తెలుసా !

తేజసజ్జా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అయితే నాని ఈ సినిమా కు నో చెప్పిన విషయం మాత్రం నాని ఫ్యాన్స్ ను తెగ ఇబ్బందిపెట్టేస్తుంది.


Published Sep 19, 2025 03:57:00 PM
postImages/2025-09-19/1758277856_TejaSajjaMiraiMovieXReview.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రతి సినిమాకు మొదట ఒకరిని అనుకొని తర్వాత ఇంకొక హీరోతో సినిమాలు తియ్యడం చాలా కామన్ . కాని మాగ్జిమమం సూపర్ హిట్ట్ సినిమాల్లో మాత్రం తొందరగా ఎవ్వరు స్క్రిప్ట్ ను వదిలేయరు. అందులోను వరుస హిట్లు కొట్టే నాని లాంటి వాళ్లు అయితే మరి వదులుకోరు. ఇంతకీ ఏంటి ఆ సినిమా అంటే రీసెంట్ సూపర్ హిట్ట్ మిరాయ్ ...ఈ స్క్రిప్ట్ ముందు నానికి చెప్తే... నో చెప్పేశాడట. ఓటీటీ 45 కోట్లు రాబట్టిన ఈ మూవీ కలక్షన్స్ కూడా గట్టిగానే చేస్తుంది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 60 కోట్లు ఈ పాటికే కలక్ట్ చేసేసింది. స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎం, యాక్షన్, స్టంట్స్ పరంగా ప్రస్తుతం సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

తేజసజ్జా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అయితే నాని ఈ సినిమా కు నో చెప్పిన విషయం మాత్రం నాని ఫ్యాన్స్ ను తెగ ఇబ్బందిపెట్టేస్తుంది. ఇంత మంచి స్క్రిప్ట్ కు నో ఎలా చెప్పారు సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తనకు ఉన్న కమిట్ మెంట్స్ ద్వారానే ఈ చిత్రాన్ని వదులుకున్నారని, మరోవైపు నాని కూడా మాస్, యాక్షన్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. హిట్ 3 తో అది ప్రూవ్ కూడా అయ్యింది. సో మిరాయ్ కూడా ఒప్పుకుంటే బాగుండనేది నాని ఫ్యాన్స్ అభిప్రాయం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hero heronani tejasajja mirai-movie first-choice

Related Articles