తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18 నుండి 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, ద్రోణి, అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, , దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18 నుండి 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, ద్రోణి, అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, , దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురవనునన్నాయి. అలాగే,హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలైన పటాన్చెరు, మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.