కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సవాల్ విసిరారు.హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, మాదవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ రాజు మీడియా సమవేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సవాల్ విసిరారు.హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, మాదవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ రాజు మీడియా సమవేశంలో మాట్లాడారు.గత ఎన్నికల సమయంలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కేవలం 12,600 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసినవేనని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లుగా 60 వేల ఉద్యోగాల నియమకాలు జరిగాయని రుజువు చేస్తే తాము తక్షణమే పదవులకు రాజీనామా చేస్తామని, ఒకవేళ నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా అని నిలదీశారు. గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన కేవలం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతోనే కాలం గడిపిందని వారు తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క కొత్త నిర్మాణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేపట్టిందని కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.