సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సోషల్ మీడియాలో ఒక అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇద్దరు వ్యక్తులను కోల్పోయానని ఆమె అందులో తెలిపారు. తన ఎదుగుదలకు, నటిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన తన తల్లి గీతను, అలాగే తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శక దిగ్గజం భారతీరాజాను కోల్పోయారు. ఒకే సంవత్సర కాలంలో ఈ ఇద్దరు ప్రియమైన వ్యక్తులు దూరమవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సోషల్ మీడియాలో ఒక అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇద్దరు వ్యక్తులను కోల్పోయానని ఆమె అందులో తెలిపారు. తన ఎదుగుదలకు, నటిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన తన తల్లి గీతను, అలాగే తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శక దిగ్గజం భారతీరాజాను కోల్పోయారు. ఒకే సంవత్సర కాలంలో ఈ ఇద్దరు ప్రియమైన వ్యక్తులు దూరమవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు."నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కారణం. అందులో ఒకరు నన్ను కన్న నా తల్లి కాగా, మరొకరు నాకు సినీ జన్మనిచ్చిన నా గురువుగారు భారతీరాజా" అని పేర్కొన్నారు.కేవలం ఒకే ఏడాది వ్యవధిలో నాకు ఎంతో ఇష్టమైన, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ ఇద్దరినీ కోల్పోయాను. ఈ బాధను మాటల్లో వివరించలేకపోతున్నా. నా హృదయం ముక్కలైంది, ఏం చెప్పాలో కూడా తోచడం లేదు" అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు.దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'కిజక్కే పోగుం రైల్' అనే తమిళ చిత్రం ద్వారానే రాధిక సినీ రంగ ప్రవేశం చేశారు. తనను వెండితెరకు పరిచయం చేసి, స్టార్ నటిగా ఎదగడానికి పునాది వేసిన గురువు మరణం ఆమెను నిలువునా కుదిపేసింది. ఒకే ఏడాదిలో అటు కన్నతల్లిని, ఇటు సినీ గురువును కోల్పోవడంతో రాధిక అనుభవిస్తున్న బాధపై సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.