మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థులు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో జూన్ 18న జరగాల్సిన పోలింగ్ అవసరం లేకుండానే ఫలితం ఖరారైంది.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థులు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో జూన్ 18న జరగాల్సిన పోలింగ్ అవసరం లేకుండానే ఫలితం ఖరారైంది. తెలంగాణలో తనపై ఉన్న ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలను ఫామ్-26 లో మీనాక్షి నటరాజన్ పేర్కొనలేదని రిటర్నింగ్ అధికారి తెలిపారు. బీజేపీ అభ్యర్థి మాయా నరోలియా, ఆమె ఎలక్షన్ ఏజెంట్ దీనిపై అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో నామినేషన్ పరిశీలన అనంతరం తిరస్కరించబడింది. అయితే, మధ్యప్రదేశ్ నుండి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించింది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్,మహేష్ కేవత్‌ని అభ్యర్థులగా బీజేపీ నిలబెట్టింది. తాజాగా వారంతా ఏకగ్రీవం కావడంతో ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ కుట్రపూరితంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నామినేషన్‌ను రద్దు చేయించిందని ఆరోపించింది. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేదని, కేవలం లీగల్ నోటీసును చూపి నామినేషన్ తిరస్కరించారని కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ తంఖా పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా జూన్ 12న విచారణ జరగనుంది.