పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మైఖేల్' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 8,673 కోట్లవసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ భారీ కలెక్షన్లతో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజిక్ బయోపిక్ చలనచిత్రంగా ఉన్న 'బోహేమియన్ రాప్సోడి' రికార్డును మైఖేల్ అధిగమించింది.
పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మైఖేల్' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 8,673 కోట్లవసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ భారీ కలెక్షన్లతో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజిక్ బయోపిక్ చలనచిత్రంగా ఉన్న 'బోహేమియన్ రాప్సోడి' రికార్డును మైఖేల్ అధిగమించింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మ్యూజికల్ బయోపిక్‌గా 'మైఖేల్' సరికొత్త రికార్డు నెలకొల్పింది.హాలీవుడ్ నిర్మాణ సంస్థ లయన్స్ గేట్ హిస్టరీలోనే 'ది హంగర్ గేమ్స్', 'ట్విలైట్ సాగా' సినిమాలను దాటేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత సోదరుడి కుమారుడు(మేనల్లుడు) జాఫర్ జాక్సన్ పోషించగా, ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించారు. కేవలం కొన్ని వారాల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, త్వరలోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 9,500 కోట్లు మార్కును కూడా దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.