INDIA: భారత్ లో.. సూర్యున్ని ఈ ప్లేస్ ల్లో అందంగా చూడొచ్చు

బీచ్ వ్యూ లో చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అలా ఇండియాలో సూర్యోదయం ..సూర్యాస్తమయం అధ్భుతంగా ఉండే కొన్ని ప్లేసులు చూద్దాం రండి.


Published Aug 24, 2024 07:41:00 PM
postImages/2024-08-24/1724508775_sunrisemorning87582593135.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సన్ రైజ్, సన్ సెట్ ఎంత అందంగా ఉంటాయంటే ..ఎంత అలిసిపోయినా కాస్త ప్రశాంతంగా అయిపోవచ్చు. ఎన్ని బాధలున్నా...పొద్దున్నే సూర్యోదయమో...సాయంత్రం సూర్యస్తమయమో చూస్తే బాధలు పోయి ..మనసు చాలా తెలికపడుతుంది. బీచ్ వ్యూ లో చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అలా ఇండియాలో సూర్యోదయం ..సూర్యాస్తమయం అధ్భుతంగా ఉండే కొన్ని ప్లేసులు చూద్దాం రండి.


* దాల్ సరస్సు
దాల్ సరస్సు ..శ్రీనగర్ ఆభరణంగా పిలుస్తారు. ఈ సరస్సు చుట్టు తెల్లని పాలపొంగులా హిమాలయపర్వతాలు ..హౌస్ బోట్ లు , పడవలు సూర్యాస్తమయం కళ్లు మూసుకొని ఊహించుకున్నా అధ్భుతంగా ఉంటుంది. చాలా మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. చూడాల్సిన ప్లేస్.


* డార్జిలింగ్..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ ప్రాంతంలో ఉన్న టైగర్ హిల్, కాంచన్ జంగ్ పర్వత శ్రేణుల మధ్య నుంచి సూర్యోదయం వేళ అధ్భుతంగా ఉంటుంది. చాలా మంది అక్కడ స్టే చేసి మరీ సూర్యోదయం చూస్తారు. చాలా బిజీ ఏరియా కూడా . మార్చి నుంచి నవంబర్ వరకు మంచి సీజన్ కూడా ..ట్రస్ట్ మీ హెవెన్ లా ఉంటుంది.


కన్యాకుమారి..
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి త్రివేణి సంగమం మధ్య సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు అత్యంత అనువైన ప్రదేశం. సౌత్ అంతా సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది. కన్యాకుమారి. విశాఖ , కాకినాడ తీరాలన్నీ సూర్యోదయం చాలా అధ్బుతంగా ఉంటుంది. నేచర్ లవర్స్ అయితే అసలు కదలరు. మనసు నిండా సూర్యున్ని నింపేస్తారు. అంత అందంగా ఉంటుంది.


నంది హిల్స్..
బెంగళూరు సమీపంలోనే నంది హిల్స్. చూడాల్సిందే. చుట్టు మేఘాలు...తెల్లవారే సూర్యుడు ...లైట్ గా చలి...పక్కన మనకు నచ్చిన వ్యక్తి ...పర్ఫెక్ట్ కాంభినేషన్. శని , ఆదివారాలు అసలు ఖాళీ ఉండదు. కాబట్టి అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకొండి. వీక్ డేస్ లో అయితే మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు.


ఆగ్రాలో..
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ సూర్యాస్తమయం వేళ మరింత అధ్భుతంగా కనిపిస్తుంది . షాజహాన్ ఈ అందానికి మరింత అందం తెచ్చేలా కట్టించారు. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు అస్తమించే సమయంలో తాజ్ మహల్ లోని మరో కోణం ఆవిష్కృతమవుతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్, ఫిబ్రవరి నుంచి మార్చి వరకు చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style india sun

Related Articles