వర్షానికి దుస్తులు దుర్వాసన వస్తున్నాయా..ఇలా చేస్తే వాసన మాయం.!

ప్రస్తుతం వర్షాకాల సీజన్ నడుస్తోంది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కనీసం బట్టలు కూడా ఆరడం లేదు.  దీనివల్ల చాలామందికి ఫంగస్ వల్ల ఒక రకమైనటువంటి దుర్వాసన కూడా వస్తుంది.


Published Sep 03, 2024 08:06:00 AM
postImages/2024-09-03/1725329954_cloths.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం వర్షాకాల సీజన్ నడుస్తోంది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కనీసం బట్టలు కూడా ఆరడం లేదు.  దీనివల్ల చాలామందికి ఫంగస్ వల్ల ఒక రకమైనటువంటి దుర్వాసన కూడా వస్తుంది. దీనివల్ల బట్టలు వేసుకోవాలంటేనే చిరాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ సీజన్ లో వేసుకునే దుస్తులు బెడ్ షీట్లు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా తప్పక చేయాల్సిందే. 

#1. బేకింగ్ సోడా:
 ముఖ్యంగా ఇంట్లో దుస్తులు బెడ్ షీట్లు టవల్స్  శుభ్రం చేసే సమయంలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి ఉతకండి. ఆ తర్వాత సాధారణ నీటిలో వాటిని  వేసి ఆర వేయండి. దీని ద్వారా  దుస్తులకు ఉండే దుర్వాసన పోయి చక్కటి వాసన వస్తుంది. 

#2.కర్పూరం
 మన హిందూ సాంప్రదాయం ప్రకారం కర్పూరాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా దేవుడి పూజ చేసేటప్పుడు కర్పూరం ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరం కేవలం దేవుడి పూజకే కాకుండా అన్నింటికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ నుంచి దుర్వాసనను తొలగించడానికి కర్పూరం ఎంతో ఉపయోగపడుతుందట.. ముఖ్యంగా ఇంట్లో ఉండే కిటికీలు తలుపులన్ని మూసేసి కర్పూరం వెలిగించారట. ఈ విధంగా కర్పూరం సువాసన ఇంట్లో ఒక 15 నిమిషాలు ఉండేటట్టు చూసుకోవాలట. దీనివల్ల ఇంట్లో ఉండే దుస్తులు దుర్వాసన కూడా సువాసన వెదజల్లుతోందట. 

#3. ఐరన్:
 ముఖ్యంగా బట్టలు పిండిన తర్వాత వాటిని ఆరేస్తాం. వర్షాకాల సీజన్ కాబట్టి ఎక్కువగా ఆరాకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. కాబట్టి ఆ దుస్తులను ఇస్త్రీ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే దుర్వాసన పోయి సువాసన వస్తుందట. 

#4. వెనిగర్:
 మన ఇంట్లో ఉండే దుస్తులు టవల్స్ ఇతర బెడ్ షీట్లను ఉతకడానికి వెనిగర్ ను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ వల్ల బెడ్ సీట్లలో ఉండే దుర్వాసన పోవడమే దుర్వాసన వెదజల్లే స్వభావాన్ని కలిగి ఉంటుందట. 

#5. సిలికా
 ముఖ్యంగా సిలికా ప్యాకెట్లు అనేవి గాలిలో ఉండే తేమను పీల్చుకోవడానికి ఎంతో  ఉపయోగపడతాయి. కాబట్టి బెడ్ షీట్లు టవల్స్ ఉన్న ప్రదేశంలో వీటిని ఉంచితే అవి పొడిగా తేమ లేకుండా చేయడంలో ఎంతో మేలు చేస్తాయట.

newsline-whatsapp-channel
Tags : news-line home dresses washing bad-smell good-smell

Related Articles