laughing Law: దేశ నాయకులు రాసిన నవ్వుల చట్టం..ఏ దేశంలోనో తెలుసా ?

నవ్వితే రోగాలు రావు..రోజుకో అరగంట నవ్వండి..హెల్దీ గా ఉంటారు. ఇది అందరికి తెలిసిందే. కాని ..రోజు చచ్చినట్లు నవ్వాల్సిందే..నవ్వకపోతే జైలు కు తీసుకొని వెళ్లిపోతారు. ఇంతకీ వింత చట్టం ఏ దేశంలో ఉందో తెలుసా ..పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమేనని సమర్థించుకుంటోంది జపాన్. ఈ చట్టం చేసింది జపాన్ పెద్దలే. కాని ఈ రూల్ పై దేశం మొత్తం తిరగబడింది. నవ్వ రాకుండా నవ్వమని చట్టాలు చేయడం ప్రజా హక్కులు కాలరాయడమే అంటున్నారు జపాన్ ప్రజలు.


Published Jul 12, 2024 02:59:00 PM
postImages/2024-07-12/1720776611_images2.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నవ్వితే రోగాలు రావు..రోజుకో అరగంట నవ్వండి..హెల్దీ గా ఉంటారు. ఇది అందరికి తెలిసిందే. కాని ..రోజు చచ్చినట్లు నవ్వాల్సిందే..నవ్వకపోతే జైలు కు తీసుకొని వెళ్లిపోతారు. ఇంతకీ వింత చట్టం ఏ దేశంలో ఉందో తెలుసా ..పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమేనని సమర్థించుకుంటోంది జపాన్. ఈ చట్టం చేసింది జపాన్ పెద్దలే. కాని ఈ రూల్ పై దేశం మొత్తం తిరగబడింది. నవ్వ రాకుండా నవ్వమని చట్టాలు చేయడం ప్రజా హక్కులు కాలరాయడమే అంటున్నారు జపాన్ ప్రజలు.


జపాన్ లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం తాజాగా ‘లాఫింగ్ లా’ తీసుకొచ్చింది.ఈ చట్టం లో ప్రజలు రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాల్సిందే. యమగట యూనివర్సిటీలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలలో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలిందట. తమ ప్రజలు రోగాలతో చావడం ఇష్టం లేక ఈ లా తీసుకొచ్చినట్లు తెలిపారు జపాన్ అధికారులు. ఈ గోల ఎందుకు ...రోజు వద్దు ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని కోరింది. దీనికి కూడా అక్కడి ప్రజలు నో చెప్తున్నారు.


నవ్వడం, నవ్వకపోవడమనేది పౌరులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ గుర్తుచేసింది.  ప్రజల హక్కులు కాలరాయొద్దని మండిపడింది.లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఆరోపణలను తోసి పుచ్చింది. కాని జపాన్ ప్రజలు మాత్రం ..నవ్వడం నవ్వకపోవడం మా ఇష్టం ...కంగారు పెట్టొద్దంటు కంప్లెయింట్స్ చేస్తున్నారట.  

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style

Related Articles