Thai AirAsia : రూ.7,390కే..హైదరాబాద్ టూ బ్యాంకాక్ ..నో వీసా బెస్ట్ ఆప్షన్

ఇప్పుడు ఎయిరేషియ నుంచి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ విమాన సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.


Published Sep 15, 2024 04:03:00 PM
postImages/2024-09-15/1726396477_mountainbkk780x470.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా వరకు కుర్రాళ్ల డ్రీమ్ ప్లేస్ బ్యాంకాక్ ..థాయ్ మసాజ్ లు..ఇంకా ఏవేవో ఏవేవో ..కుర్రాళ్లకు బ్యాంకాక్ డ్రీమ్ . ఇప్పటికే వైజాగ్ సహా దేశంలోని 12 నగరాల నుంచి  థాయ్ ల్యాండ్ నుంచి విమాన సర్వీసులు నడుపుతుంది. ఇప్పుడు ఎయిరేషియ నుంచి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ విమాన సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.


హైదరాబాద్‌- బ్యాంకాక్‌ సర్వీసును అక్టోబరు 27 నుంచి, చెన్నై-ఫుకెట్‌ సర్వీసును అక్టోబరు 30 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.  అది కూడా జస్ట్ హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌కు రూ.7,390కి, చెన్నై నుంచి ఫుకెట్‌కు రూ.6,990కే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఆఫర్ మీద కూడా ఈ నెల 22 వరకు రాయితీ టికెట్లు ఎయిరేషియా.కామ్ , ఎయిరేషియ మూవ్ యాప్ పై విక్రయిస్తామని థాయ్ ఎయిరేషియా టీం మెంబర్ తెలిపారు.


హైదరాబాద్‌-బ్యాంకాక్‌ మధ్య 2024 అక్టోబరు 27 నుంచి 2025 మార్చి 29 వరకు, చెన్నై-ఫుకెట్‌ మధ్య 2024 అక్టోబరు 30- 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఇండియన్ సిటిజన్స్ కు వీసా అక్కర్లేదు. జస్ట్ పాస్ పోర్ట్ ఉంటే చాలు. ఇకపై తక్కువ ధరతో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : secundrabad ticket-rates flight-tickets visakhapatnam

Related Articles