PURI : పూరీ జగన్నాథుని రథం...శ్రీమహాలక్ష్మి పగలగొడుతుందా ..!

పూరీ జగన్నాథ్ ...కృష్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడని ..నమ్మే ప్రదేశం. స్వామి వారి గుండె ఇక్కడ ఇంకా సజీవంగా ఉందని హిందువులు నమ్ముతారు. అయితే గుడించా ఆలయానికి స్వామి రథోత్సవం రోజు చేరుకుంటారు. ఇక్కడే బల రామ, జగన్నాథ, సుభద్రా దేవిలు ఏడు రోజులు పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఈ దేవాలయంలో జగన్నాథుని దర్శించుకోవడాన్ని " ఆడప్ దర్శనం" అంటారు. గుండిచా జగన్నాథుని భక్తుడు. తన భక్తిని గౌరవిస్తూ భగవంతుడు ప్రతి ఏడాది స్వామి వారు ఇక్కడికి వస్తారని నమ్మకం. స్వామి వారు ...ఎన్ని యుగాలు మారినా..స్వామి వారు ఆ భక్తున్ని కలవడానికి వస్తారని నమ్ముతారు.


Published Jul 12, 2024 06:49:00 PM
postImages/2024-07-12/1720790396_33.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పూరీ జగన్నాథ్ ...కృష్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడని ..నమ్మే ప్రదేశం. స్వామి వారి గుండె ఇక్కడ ఇంకా సజీవంగా ఉందని హిందువులు నమ్ముతారు. అయితే గుడించా ఆలయానికి స్వామి రథోత్సవం రోజు చేరుకుంటారు. ఇక్కడే బల రామ, జగన్నాథ, సుభద్రా దేవిలు ఏడు రోజులు పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఈ దేవాలయంలో జగన్నాథుని దర్శించుకోవడాన్ని " ఆడప్ దర్శనం" అంటారు. గుండిచా జగన్నాథుని భక్తుడు. తన భక్తిని గౌరవిస్తూ భగవంతుడు ప్రతి ఏడాది స్వామి వారు ఇక్కడికి వస్తారని నమ్మకం. స్వామి వారు ...ఎన్ని యుగాలు మారినా..స్వామి వారు ఆ భక్తున్ని కలవడానికి వస్తారని నమ్ముతారు.


జగన్నాథ రథయాత్రలో మూడో రోజున వచ్చే పంచమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కూడా కేవలం పూరీ లో చేస్తారు . ఈరోజున మాతా లక్ష్మి ఆలయం నుంచి బయలుదేరి పర్యటనకు వెళ్లిన జగన్నాథుడికి కలవడానికి వస్తుంది. అప్పుడు ద్వైతపతి తలుపు మూసేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆగ్రహంతో రథచక్రాన్ని పగులగొడుతుంది. ఈ ఆచారం ఇప్పటికీ ఉంది..స్వామివారి రథం ఈ కార్యక్రమం అయినాక చూస్తే ఎక్కడో ఒక దగ్గర రథం చిన్నది విరిగి ఉంటుందట. 


దీని తర్వాత ఆమె ‘హేరా గోహిరి సాహి పూరి’ అనే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడే లక్ష్మీదేవి ఆలయం ఉంది. తర్వాత జగన్నాథునిచే కోపంతో ఉన్న దేవతను శాంతింపజేసే సంప్రదాయం ఉంది. ఆషాడ మాసం దశమి రోజు స్వామి వారి రథాలు తిరిగి ...దేవాలయానికి చేరుకుంటాయి. స్వామివారి విగ్రహాలకు పవిత్ర స్నానం చేశాకమాత్రమే...తిరిగి ప్రతిష్టాపన చేస్తారు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu life-style

Related Articles