SSY ACCOUNT: సుకన్య సమృధ్ధి యోజన అకౌంట్ లో రూల్స్ ఛేంజ్ !

కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి.


Published Sep 04, 2024 10:18:54 PM
postImages/2024-09-05/1725506158_image.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లోను సుకన్యసమృధ్ధి కోసం అందరికి తెలుసు. ఆడపిల్లలకు ఇది ఓ భరోసా. తక్కువ తక్కువ మొత్తంలో ఎక్కువ పొదుపు చెయ్యొచ్చు. ఆ డబ్బును ఆడబిడ్డ చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది.  కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి. వెంటనే ఈ రూల్స్ ను ఫాలో అవ్వకపోతే అకౌంట్ క్లోజ్ చెయ్యకపోతే చాలా ఇబ్బందులు పడతారని తెలిపింది. 


కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు పేరెంట్స్ పేరు మీద లేకపోతే ...అకౌంట్ క్లోజ్ చేస్తారు. వెంటనే తల్లిదండ్రుల పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. లేదా అటువంటి ఖాతాలు మూసి వేయాల్సి ఉంటుంది. ఒకే ఆడపిల్ల పేరిట రెండు కంటే ఎక్కువ అకౌంట్లు ఓపెన్‌ చేస్తే, అదనపు అకౌంట్లు వెంటనే క్లోజ్‌ అవుతాయి. వీటిలో అసలు మాత్రమే మీకు వెనక్కివస్తుంది.


ఎస్ఎస్ వై అకౌంట్‌ను తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ,తాతయ్యలు నుంచి తల్లిదండ్రులకు బదిలీ చేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. ఒకవేళ గ్రాండ్ పేరెంట్స్ అకౌంట్ ఓపెన్ చేసి చనిపోతే వారి డెత్ సర్టిఫికేట్ తో మ్యానేజ్ చెయ్యొచ్చు ఒరిజినల్‌ అకౌంట్‌ పాస్‌బుక్, ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం, కొత్త గార్డియన్ ఐడెంటిఫికేషన్‌ ప్రూఫ్‌, ట్రాన్స్‌ఫర్‌ అప్లికేషన్‌ ఫామ్. ఈ డాక్యుమెంట్స్ తీసుకుని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ ట్రాన్స్ ఫర్ పెట్టుకోవచ్చు.


ఈ  స్కీంలో ఆడపిల్లలు పుట్టిన వెంటనే ..లేదా  10 యేళ్ల లోపు పిల్లలు కూడా అకౌంట్ క్రియేట్ చెయ్యొచ్చు. సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయికి 21 రాగానే డబ్బులు తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu girls sukanya-samrudhi-yojana central-finanace-minister new-rules

Related Articles