RAILWAYS : రైలు ప్రయాణాల్లో ఈ బోగీల్లో ఎక్కితే కేసు అవుతుందని తెలుసా ?

శుక్రవారం రైల్వేస్టేషన్లో తనిఖీలు కూడా నిర్వహించారు. దాదాపు వంద మందికి పైగా పెనాల్టీ వేశారు. వీరందరిని రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Published Aug 26, 2024 10:15:00 AM
postImages/2024-08-26/1724647554_PTI21032020000043B.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిత్యం వేలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. కొందరికి సడన్ ప్లాన్..మరికొందరికి ప్రీ ప్లాన్ ..టెన్షన్ లో ఎక్కేవాళ్లు మాత్రం కాస్త ట్రైన్ బోగీలు చూసుకొని ఎక్కాలి.లేదంటే రైల్వే పోలీసులు తీసుకెళ్లిపోతారు. కొన్ని సార్లు కావాలని కాకపోయినా హా..ఎవరు చూస్తారులే అనే ధీమాతో ఎక్కేస్తుంటారు. పోలీసులు మంచోళ్లు అయితే చెప్పి వదిలేస్తారు. అదే ఏ స్ట్రిక్ట్ ఆఫీసరో అయితే ఫైన్ రాసి నాలుగు రోజులు జైళ్లో ఉండు అని పెనాల్టీ విత్ పనిష్మెంట్ రాసేస్తారు. ఇంతకీ ఏంటీ బోగీలు అంటారా .


మహిళలకు, దివ్యాంగులకు కేటాయించిన బోగీల్లోకి వెళ్లకపోవడమే మంచిది. ఎప్పటి నుంచో ఈ రూల్ ఉన్నా...ఈ మధ్య ఈ శిక్షలు మరింత కఠినం చేసింది . రైళ్లలో దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన బోగీల్లో ఇతర ప్యాసింజర్లు ఎక్కితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. ఈ శుక్రవారం రైల్వేస్టేషన్లో తనిఖీలు కూడా నిర్వహించారు. దాదాపు వంద మందికి పైగా పెనాల్టీ వేశారు. వీరందరిని రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


తమ జర్నీ సమయంలో రైళ్లలో ఖాళీ లేకపోతే మరో రోజుకు వాయిదా వేసుకోవాలని తెలిపారు. అంతేకాని దివ్యాంగులు, మహిళలకు ఇబ్బంది కలిగించేలా జర్నీ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువమంది లోకల్స్ ఈ పని చేస్తుంటారని ..పక్క స్టేషన్ దిగిపోతామని లేదా ఎవరు చూస్తారనే నిర్లక్ష్యంతో ఈ పనిచేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని అంటున్నారు.


కొంతమంది తినడానికి తిండే లేక చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు. వారందరికీ ఆర్పీఎఫ్‌ పోలీసులు ఆహారం అందజేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఎక్కువమంది జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నవారే . కాస్త చూసుకొని వెళ్లాల్సిందిగా కోరుతూ వారిని వార్నింగ్ ఇచ్చి వదిలేశారట పోలీసులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railwaystation train

Related Articles