Veg Cities in India: ఇండియాలో ప్యూర్ వెజ్ తినే ఊర్లు ఇవే

ప్రతి హిందువుకు అది తన జన్మతహా...వచ్చిన హక్కులా భావిస్తారు. అసలు ఏ ఏ ప్రాంతాల్లో వెజ్ తింటారో చూద్దాం.


Published Sep 05, 2024 03:52:26 AM
postImages/2024-09-05/1725519268_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆరోగ్యం మహాభాగ్యం ..వంద కాలాల పాటు సుఖంగా హెల్దీగా బతకాలంటే...ఆహారం ముఖ్యం. హెల్దీ ఆహారం అంటే..శాఖాహారమా..మాంసాహారమా...ఈ డిస్కర్షన్ ఎన్నో యేళ్ల నుంచి నడుస్తుంది కాని ...కొన్ని ప్లేసుల్లో మాత్రం ఖచ్చితంగా శాఖాహారమే తింటారు. ప్రతి హిందువుకు అది తన జన్మతహా...వచ్చిన హక్కులా భావిస్తారు. అసలు ఏ ఏ ప్రాంతాల్లో వెజ్ తింటారో చూద్దాం.


మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినలేరు. ఆ నగరాల్లో ఎలాంటి మాంసాహారం దొరకదు. కనుక ఈ నగరాలను భారత దేశ శాఖాహార నగరాలుగా పిలుస్తారు. ఈ రాష్ట్రాల్లో ఉండే వారు 99 శాతం శాఖాహారులే. కొన్ని సిటీల్లో అయితే అసలు నాన్ వెజ్ తినడానికే అనుమతి లేదు. అందులో గుజరాత్ , హర్యానా , రాజస్థాన్ లోని కొన్ని జిల్లాలు నాన్ వెజ్ తినడానికి అనుమతి లేదు.


రిషికేశ్, ఉత్తరాఖండ్: గంగా నది తీరంలో ఉన్న పవిత్రనగరం రిషికేశ్. ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉన్న ఈ నగరానికి ఎక్కువ మంది మానసిక ప్రశాంతత కోసం, మోక్షం కోసం వస్తారు. ఈ నగరం చుట్టూ ముళ్ల చెట్లు..  పచ్చని పచ్చని కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఇది దేవాలయాల నగరం. ఇక్కడ చాలా మంది ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వస్తారు కనుక మాంసాహారం అనుమతి లేదు. దేవభూమి లో జీవహింసను ఎంకరేజ్ చేయరు కాబట్టి అనుమతి లేదు.


వారణాసి శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరం శివుడు నిర్మించడానికి నమ్మకం. ఇక్కడ శాఖాహారం మాత్రమే అనుమతి ఉంది.హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగా నది తీరాన్న వెలసిన నగరం హరిద్వార్. ఇక్కడ అంతా సలాడ్ లు , వెజ్ సూప్ లు ఇవే..ఇంకా ఇఫ్పుడిప్పుడు మ్యాగీలాంటివి ఇక్కడ బాగా అమ్ముడవుతున్నాయి.


మధురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని ఆ రాష్ట్ర గుండె అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాకాహారం. కాని ఇది ఎవ్వరు నమ్మరు.అయోధ్యలో మాంసాహారాన్ని అందించే ఒక్క రెస్టారెంట్ కూడా లేదు. రాములవారు పుట్టిన నేలమీద మాంసాహారం నిషేధం.


పాలిటానా, గుజరాత్: ఈ నగరం కూడా పూర్తి శాకాహారమే.. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మొదటి శాకాహార నగరంగా ప్రసిద్దిగంచింది. అందుకనే శాకాహారులకు స్వర్గధామం. జైనులు ఇక్కడే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శాఖాహార నియమాలు జైనులకు మాత్రమే ఉంటాయి. శ్రీకృష్ణుడు ఎన్నో చిలిపి పనులు చేసిన మధుర లోను నాన్ వెజ్ తినరు.
 

newsline-whatsapp-channel
Tags : food-habits india healthy-food-habits food

Related Articles