అంత సీనుందా. హే..ఊకోర్రి. కాంగ్రెస్ కు అంత సీన్మ లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికల్ల తేలిపొయింది గదా. మల్ల మున్సిపల్ ఎన్నికల్ల గూడ గట్లనే అయితది. మొన్నంటె..అన్నొచ్చినయ్ ఇన్నొచ్చినయ్ అని శెప్పుకుర్రు. ఈ తాప పార్టీ గుర్తుల మీదనే గదా అయితున్నయ్ ఎన్నికలు. బీఆర్ఎస్ కు వచ్చినన్ని సీట్లు వచ్చుడంటె అయ్యే ముచ్చట కాదులే పోర్రి. అబ్బో..ఏదో శిత్రమైన లెక్కలే ఏస్తున్నా అనుకుంటుర్రా. శిత్రం గాదుల్లా. అసలు సిసలు లెక్కలే సూడుర్రి.