'ఆల్ఫా' టీజర్ రిలీజ్.. యాక్షన్ మోడ్‌లోకి ఆలియా భట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్‌ విడుదలైంది. 1 నిమిషం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఆలియా భట్ మునుపెన్నడూ చూడని రీతిలో హై-వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో ఇరగదీశారు. 
 


Published Jun 10, 2026 05:40:17 PM
postImages/2026-06-10/1781093417_1000025997.jpg

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్‌ విడుదలైంది. 1 నిమిషం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఆలియా భట్ మునుపెన్నడూ చూడని రీతిలో హై-వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో ఇరగదీశారు. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ బాబీ డియోల్, ఆలియాకు కఠినమైన శిక్షణ ఇచ్చే తండ్రి పాత్రలో నటిస్తూ కీలకమైన రోల్ పోషిస్తున్నారు.'YRF స్పై యూనివర్స్' (YRF Spy Universe) లో వస్తున్న మొట్టమొదటి మహిళా ప్రధాన యాక్షన్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో మరో కీలకమైన స్పై పాత్రలో శార్వరీ వాఘ్ నటిస్తుండగా, అనిల్ కపూర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.  'ది రైల్వే మెన్' సిరీస్ ఫేమ్ శివ రావల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్ జూలై 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 

newsline-whatsapp-channel
Tags : entertainment movie-news teaser-release alia-bhatt

Related Articles