ఏం చేస్తరేంది. ఏం చేశేటిదుండదు. వాళ్లకంత సీన్మ లేదు. పోలీసోళ్లు మమ్ములనేం చేయలేస్తరు. ఏందోనుల్లా. డీజీపీ శివధర్ రెడ్డి సారు, పోలీస్ పెద్ద సజ్జనార్ సార్ అంటె నాకు మస్తు భయం. వామ్మో వాళ్ల చేతిల ఎంత పవర్ ఉంటదో తెల్షా. అద్దుమరాత్రుల్ల ఇండ్లమీద పడి జర్నలిస్టుల్నే అరెస్టులు చేశిర్రు అని భయపడ్డా. కనీ..గీ దడ్పిచ్చుడంత కొల్వులు చేసుకునే జర్నలిస్టుల మీదనే గానీ. అధికారంల ఉన్న లీడర్ల జోలికి పొయ్యెటంత దైర్నం ఎక్కడిది అనిపిస్తున్నది గదా చూస్తరా.