బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే విడుదలైన అధికారిక ప్రోమో ద్వారా ఈ సీజన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు వెల్లడయ్యాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే విడుదలైన అధికారిక ప్రోమో ద్వారా ఈ సీజన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ సరికొత్త సీజన్‌ను "బిగ్ బాస్ దశావతారం" అనే కాన్సెప్ట్‌తో తీసుకువస్తున్నారు. ఇందులో 10 విభిన్నమైన అవతారాలు, సరికొత్త ట్విస్టులు ఉండబోతున్నాయట.ఈ సీజన్ క్యాప్షన్ "ఆటలో సవాలు కాదు.. ఆటే ఒక సవాలు" అని ప్రకటించారు. అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ ఇల్లు సరికొత్త టెక్నాలజీ, ఏఐ (AI) సెటప్, మైండ్ గేమ్‌లతో మరింత కఠినంగా ఉండబోతోందని సమాచారం. ఈ సీజన్ ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ షో 2026 ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కంటెస్టెంట్లు అధికారిక కంటెస్టెంట్ల లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బుల్లితెర నటీనటులు దీపిక, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వర్ష, హరిత,వసంతి కృష్ణ భర్త పవన్ కళ్యాణ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా దాదాపు 10 మంది కామనర్స్‌ను హౌస్‌లోకి పంపే అవకాశం ఉందని టాక్ వినిస్తోంది.