రేవంత్ నోటికి వచ్చేది బూతేనా..?

ఒకటి శెప్పుర్రి. సర్కార్ చీరెలిచ్చింది గదా. ఆ చీరె గట్టుకోని ఎవ్వలైన ఏదన్న ఫంక్షన్ కు పొయ్యిర్రా. ఏ అంటే..పొయ్నం..బీ అంటే పోలేదు..సీ అంటే గా చీర ఇంట్ల కట్టుకునుడే ఎక్వనంటె..ఫంక్షన్ కు పోతమా. అని కామెంట్ లు పెట్టుర్రుల్లా. అన్నట్లు గా చీరెలెందుకు పనికొస్తున్నయో సూడుర్రి.


Published Feb 05, 2026 01:01:01 PM
postImages/2026-02-05/1770276661_1copy.jpg

అగో..రేవంత్ సార్ మల్ల షురువ్ చేశిండు గదా ఎన్నికల ప్రచారాలు. ఆ నడ్మ జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు జనంలకొచ్చిండు. మల్ల సర్పంచ్ ఎన్నికలప్పుడు జనంలకొచ్చిండు..మల్ల ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలప్పుడు జనంలకొస్తుండు. మల్ల నాలుగు డైలాగులు దంచుతడు..తొండలు అంటడు..మల్ల గూట్ల పడ్తడు గావచ్చు.

కనీ...ఇక్కడ శిత్రమేందంటె...గీ చీరలు సూడుర్రి. మొన్నీ నడ్మ పంచిర్రు గదా. ఆ చీరలు కట్టుకోని ఏ ఫంక్షన్ కు పొయ్నా..ఆ వచ్చిందిలే సర్కార్ ఇచ్చిన చీర కట్టుకోని అనుకుంటరు గదా. ఆడోళ్లు గా మాట పడ్తరా. మేం అంతకు కొన్నం ఇంతకు కొన్నం అని చెప్పుకుంటరైతె. గందుకే..గా చీరలు కట్టుకోని ఎటు పోవాల్నో తెల్వక..ఆయ్న ఇచ్చిన సక్కదనాల చీరలు గివే అని సూపెట్టెటందుకు..మల్ల గా కాంగ్రెస్ మీటింగ్ కే వచ్చినట్లున్నరు గదా. గిదొక ప్రచారం అనుకుంటుర్రు గావచ్చు. కనీ..మున్సిపాలిటీల్ల ఇయ్యనట్లున్నరు గదా. అంటె ఈళ్లంత ఊళ్లకెంచి వచ్చిన జనాలేనా ఎట్ల. నడుస్తుంది మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం కదా.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles