వామ్మో రేవంత్ సారో. పెద్ద తెల్వే. మంత్రులందర్కి ఫిటింగ్ పెట్టిర్రట గదా. తేనె పూశ్న కత్తితోని వార్నింగ్ ఇస్తుర్రట గదా. మోకాలికి బోడగుండుకు ముడి పెట్టడం అంటరు గదా. అగో గదే చేస్తుండట సారు.
చూశిర్రానుల్ల. ఉత్తగనే అయితడా మరి సీఎమ్ము. ఎంత తెల్వుంటె సోనియ గాంధీ, రాహుల్ గాంధీ పద్విల ఉంచుతుర్రు శెప్పుర్రి. గదంత మూటల మహిమ అంటరా గది వేరే ముచ్చట గానీ. ఇప్పుడు చూశిర్రా. మంత్రులందర్కి ఫిటింగ్ పెట్టిండట సీఎం సారు. మున్సిపల్ ఎన్నికలకు వాళ్ల మంత్రులకు ముడేశిండట. ఏ మంత్రికైన ఇంచార్జ్ జిల్లా ఉంటది. వాళ్ల లోకల్ జిల్లా ఉంటది గదా. ఇంచార్జ్ జిల్లాల్ల, వాళ్ల లోకల్ జిల్లాల్ల మున్సిపల్ ఎన్నికల్ల గెల్శే బాధ్యత పెట్టిండట సీఎం సారు. అటీటైతె మీ మంత్రి పద్వులకు ప్రమాదమే అంటుండట. తొందర్లనే మంత్రి పదవుల ప్రక్షాళన ఉంది. అండ్ల మీ మంత్రి పదవి పోకుంట ఉండాల్నంటె
మీ నియోజక వర్గాల్ల, మీ జిల్లాల్ల మీ ఇంచార్జ్ జిల్లాల్ల మున్సిపాలిటీలు గెల్షుకోని రార్రి. లేకుంటె మీ పద్వులు ఉంటె ఉంటయ్ పోతె పోతయ్. గదంత నన్ను అడగొద్దు అంటుండట. అబ్బో సీఎం సారు బగ్గనే పెత్తనం చేస్తుండు గానీ. మా పద్వులు ఊడగుంజెటంత బలం పవర్ మీకుందా అనెటోళ్లు గూడ ఉండొచ్చు గానీ. లోపట లోపట మాత్రం బగ్గనే భయం ఉందట. ఏమో ఢిల్లీకి ఎసొంటి రిపోర్టులు పంపుతడో ఏమో అని లోపట లోపట టెన్షన్ పడ్తుర్రట. ఎట్లనన్న జేశి..మున్సిపాలిటీలు గెల్షుకోని రావాలె అని ఆలోశ్న చేస్తుర్రట. కనీ జనంతోని కష్టమే ఉన్నదట. ఊళ్లల్లకు పోతె..ఏం జేశిర్రని వచ్చిర్రు మీరు అంటరు గదా. నోటికొచ్చిన హామీలిచ్చిందేమో రేవంత్ సారు. ఇప్పుడు జనం ముంగట్కి పొయ్యేటిదేమో మంత్రులు, ఎమ్మెల్యేలు. గయ్యన్ని ఏమైనయ్ అని వీళ్లనే గదా అడుగుతరు. రేవంత్ సారు మాత్రం మంచిగ తమాషా చూస్కుంట కూసుంటడు గావచ్చు. ఏం తెల్వి ఏం తెల్వి.