ఓ అంతేనా. కాంగ్రెస్ కు అంత దమ్ములేదా. పవన్ కల్యాణ్ అంటె భయపడ్తుందా. తెలంగాణల కాంగ్రెసోళ్లకు పవన్ కల్యాణ్ అంటె వణుకు మొదలైతదా. గివేనుల్లా. బయట గివే అంటుర్రు. పవన్ కల్యాణ్ వస్తుండంటె..కాంగ్రెసోళ్లకు నలక తడవడ్తుందట. అగో...మహేశ్ గౌడ్ సార్ మాటలిని ఇంకింత కామెంట్లు చేస్తుర్రుల్లా.
మహేశ్ గౌడ్ సారు జర నిమ్మలమే గానుల్ల. ఈ నడ్మ రెండు లక్షల ఉద్యోగాలు ఐదేండ్లకిస్తం అని చెప్పింది గూడ ఈయ్ననే. తెలంగాణ కాంగ్రెస్ కు పెద్దమన్షి ఈయ్ననే గదా. మరి యాడికెంచి దైర్నం వచ్చిందో గానీ. పవన్ కల్యాణ్ ను ఎంత మాట అన్నడో సూడుర్రి.