ప్రజల సొమ్ముపై పెద్దల కన్ను?

ప్రజా ప్రభుత్వం.. సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ప్రజా సంక్షేమం దేవుడెరుగు కానీ, ఆ పేరు చెప్పుకుని పార్టీ కార్యక్రమాలు మాత్రం దండిగానే చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పేరుకే అధికారిక కార్యక్రమాలు కానీ, ఆ పేరుతో మాత్రం కోట్లది రూపాయలు ఖర్చు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.? ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది.


Published Mar 05, 2026 01:29:00 PM
postImages/2026-03-05/1772695660_CONGRESSKHARCHU.jpg

తెలంగాణలో ఇందిరమ్మ పాలన గాడి తప్పింది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు సొంత ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నారు. ప్రజాప్రభుత్వంలో పేదల అభివృద్ధే లక్ష్యమంటున్న కాంగ్రెస్ నేతలు.. క్షేత్ర స్థాయిలో మాత్రం మరోలా ఉంది. ఒకవైపు మంత్రుల ఇళ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. మంత్రులు తమ నివాసాలకు ఆ నిధులను మళ్లీస్తున్నారు.

 

ఇటీవల వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్  తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. దీనికోసం హరిత హోటల్ ను వినియోగించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, మీటింగ్ వచ్చే కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది అవుతుందని హోటల్ ను రెనొవేషన్ చేశారు. అందుకోసం 81 లక్షలు ఖర్చు చేశారు. దీనిని ప్రత్యేకంగా జీవో జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు.. క్షణాల్లో నిధులు విడుదల కావడంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. అక్కడ ఏమైనా చేశారా అంటే అదీ లేదు. డీసీసీలకు, అందులోనూ ఆంధ్రా డీసీసీల జల్సాలకు ఖర్చు చేయడంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ పరంగా చేయాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. అందులోనూ ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలకు కూడా ఇక్కడి సొమ్మును ఖర్చు చేయడం చర్చనీయాంశం అయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలంటే ఇక్కడ రాజకీయంగా ఉపయోగపడారని.. ఆంధ్రా డీసీసీల ఇక్కడ శిక్షణ తీస్కొని ఇక్కడ వెలగబెట్టేది ఏమున్నది అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. బస్తీల్లో పేదల గూడు కూల్చి భూములు కాజేస్తరు.. గురుకులాల్లో తిండి సక్కగ పెట్టకుండా ప్రజల సొమ్ముతో జేబులు నింపుకుంటరని సామాన్యులు మండిపడుతున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా పేదలు నానా అగచాట్లు పడుతుంటే వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా.. కేవలం మంత్రుల ఇళ్లలో ఉండే బాత్ రూమ్ రిపేర్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసొమ్ముతో జల్సాలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్  నెంబర్ 30లో బీరువాతో పాటు దానికి సంబంధించిన కొన్ని సివిల్ పనుల కోసం ఏకంగా 30 లక్షలు విడుదల చేశారు. అంతకుముందు వరంగల్ లో ఒక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ రిపేర్ కోసం లక్షల రూపాయలు విడుదల చేశారు. గెలిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా రాని ఎమ్మెల్యే కోసం లక్షలాది రూపాయలు విడుదల చేయడం వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ లో లక్షలాది రూపాయల ప్రజల సొమ్ముతో విలాసవంతంగా బాత్రూంలు కట్టుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

 

ఇంతేకాదు.. తెలంగాణకు ఏమాత్రం పనికి రాని వాటి కోసం రెండేళ్లలో కోట్లలాది రూపాయలు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మిస్ వరల్డ్ కి 2 వందల కోట్లు, గ్లోబల్ సమ్మిట్ కి వంద కోట్లు, భారత్ సమ్మిట్ కి 10 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు మెస్సితో ఫుట్ బాల్ మ్యాచ్ పది కోట్లు.. ఆ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి 5 కోట్లు ఖర్చు చేశారు. దీనికి సింగరేణి నిధులను వాడడం మరోఎత్తు. ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్లిన ప్రతిసారి మూడు కోట్ల ఖర్చు అవుతుందట. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్శిటీలో క్లాసుల కోసం కోటి రూపాయలు స్వాహా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దుబారా ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy brs congress cm-revanth-reddy congress-government gusagusa gusa-gusa political-gusagusa

Related Articles