అయ్యాల రేవంత్ రెడ్డే చెప్పిండు. ఒక పార్టీల గెల్శి ఇంకో పార్టీలకు పోతె రాళ్లతో కొట్టుర్రి అని. హోహోహో...గిది నా మాట కాదుల్లో..కాంగ్రెస్ ల ఒగ పెద్ద లీడర్ చెప్పిన మాట. మరి బీఆర్ఎస్ ల గెల్శి కాంగ్రెస్ ల కొచ్చినోళ్లకు రేవంత్ రెడ్డి సారు ఏం చెబుతుండా అంటరా. గది గీ సార్ కే తెల్వాలె.
అర్రర్రే...ఎంత డ్రామా నడుస్తుందుల్లా జగిత్యాలల. రామ్ గోపాల్ వర్మ సీన్మ నడ్శినట్లే ఉన్నది. ఏడాది సంది గిదే పంచాది. జీవన్ రెడ్డి సార్ కు నిద్రలేకుంట చేస్తుర్రు పాపం. రిటైర్ మెంట్ టైంల..దు:ఖం తెప్పిస్తుర్రు అని గోసవడ్తుండు సారు. పాపం కార్యకర్తల సూడంగనే కండ్లనీళ్లు తీస్తుండు. అర్రే...ఓదార్షు సార్ ఓదార్షుర్రి. కార్యకర్తలను లీడరు, లీడర్ ను కార్యకర్తలు ఒగళ్లనొగళ్లు ఓదార్షుకుంటుర్రుల్లా జగిత్యాలల.