ప్రకృతి నాశనం అయిన పర్లేదు. పేదల గూడు కూలిపోయిన పట్టింపు లేదు. నిర్వాసితులు ఆందోళన చేసినా నెవ్వర్.. అంటూ తాము అనుకున్నదే చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవరం ప్రాజెక్టులపై వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ప్రజలు,
వాయిస్: 1
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యాంరెంటీలు, 420 హామీలను ఇంత వరకు పట్టించుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా హామీల సంగతి దేవుడెరుగు. అయితే.. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన ప్రజా ప్రభుత్వం ఇతర వాటికి వృథాగా ఖర్చు చేస్తున్నారు. అందుకోసం ముందుగానే భారీ ప్లాన్ చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గేదెలే అంటున్నారు. అందుకోసం ఉగాది రోజున మూసీ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. మూసీ ప్రాజెక్టు విషయంలో బాధితుల నుండి వ్యతిరేకత వస్తున్నా వెనక్కి తగ్గకుండా, జేసీబీలతో చెట్లను తొలగిస్తున్నారు అధికారులు.
స్పాట్:
వాయిస్: 2
మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై ముందుకే వెళ్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎవరూ అడ్డుపడినా ప్రాజెక్ట్ ను ఆపే ప్రసక్తి లేదంటున్నారు. మురికిలో కూరుకుపోయిన మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటున్నారు. అయితే.. మూసీ పేరుతో వేలాది కోట్లు దోపిడికి తెర తీశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని, ఆయన ప్రతి అడుగులోనూ భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉందని విమర్శిస్తున్నారు.
స్పాట్:
వాయిస్: 3
మూసీ రివర్, గాంధీ సరోవర్ నిర్మాణం కోసం దొంగచాటున పనులు ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో రాందేవ్ గూడ వద్ద జేసీబీలతో చెట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. వాహనదారులు, స్థానికులకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్ అడ్డుగా పెట్టి చెట్లను నరుకుతున్నారు అధికారులు. అంత మంచి పని అయితే గ్రీన్ మ్యాట్ లు పెట్టాల్సిన అవసరం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. పెద్ద పెద్ద వృక్షాలను నరకడం పట్ల పర్యావరణ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలిదశలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 20 కిలోమీటర్ల వరకు మూసీ సుందరీకరణకు 5వేల కోట్లు అవసరమని గుర్తించారు. ఇందులో 4,100 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి సేకరించనుంది ప్రభుత్వం. ఇటు గాంధీ సరోవర్ కోసం కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన 38.09 ఎకరాల భూములను కూడా సేకరించింది తెలంగాణ ప్రభుత్వం.
స్పాట్:
వాయిస్: 4
ఇది ఇలా ఉంటే.. మరోవైపు.. ప్రజల కోసం డబ్బులు లేవు కానీ, సొంతిల్లు కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెండు వందల కోట్ల ప్రజాధనంతో తన కోసం బంగ్లా కట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే లెక్క పెద్దదిగా కనిపించకుండా.. చిన్స చిన్న టెండర్లు వేసుకున్నారు సీఎం. అందులో కేవలం 9కోట్లను గోడలు కట్టడానికి ఖర్చు చేస్తున్నారు. మంత్రి పొంగులేటి పదవ కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
స్పాట్:
వాయిస్: 5
ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట వేలాది మంది గూడు చెదరగొట్టే ప్లాన్ మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత రావడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు అంటూ దాట వేస్తున్నారు. కానీ, మూసీ రివర్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసమే తొలి ప్రాధాన్యత అంటూ ఊదరగొడుతున్నారు. ఇలా అయితే.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.