ఏదో డైలాగ్ ఉంటది గానుల్ల. శత్రువులు ఎక్కడో ఉండర్రా. ఇంటోళ్ల రూపంల మన సుట్టే తిర్గుతుంటరు అని సీన్మ డైలాగ్ ఉండె గదా. అగో అట్లనే అయితుంది రాజకీయంల గూడ. పవనాలు సారు ఎర్కనే గదా. ఆంధ్రప్రదేశ్ ల డిప్యూటీ సీఎం. గదేనుల్లా. తెలంగాణ వచ్చినప్పుడు వారం దినాలు తిండిగూడ పోలేదన్న సారు. మల్ల మొన్ననేమో..తెలంగాణోళ్ల దిష్టికళ్లుబడి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నయ్ అన్నడు గదా. అగో గా సార్ కు తెలుగు రాష్ట్రాల్ల ఫ్యాన్స్ తక్కువున్నరా శెప్పుర్రి. మరి గసొంటి ఫ్యాన్ కు..సార్ కు జవుడం అయితె ఎట్లుంటదో చూస్తరా.
<