మాస్ లీడరంటె మాస్ లీడరేనుల్లా. హరీశన్నకు ఆ పేరెందుకొచ్చిందా అనుకునేదాన్ని. ఇగో గీ శిత్రం చూస్తె తెలుస్తది సూడుర్రి.
గిట్లుంటది హరీశన్న అంటె. జనంల జనమై కల్శి పోవాల్నంటె అన్న తర్వాతనే. అక్కలందరితోని ముచ్చటవెట్టుకుంట వాళ్ల కష్టాలన్ని అర్సుకున్నడు. జల్దిన్నే మన సర్కార్ వస్తది. లెక్కలన్ని సరి చేస్తం. మున్సిపల్ ఎన్నికల్ల మనం గెల్వాలె. అప్పుడే కాంగ్రెస్ కు భయం వస్తది అని చెబుతున్నడు గావచ్చు.
మున్సిపల్ ఎన్నికలైతున్నయ్ గానుల్ల. అగో గా ప్రచారంల బిజీగున్నడు హరీశన్న. పటాన్ చెరు దిక్కు పొయ్యి..గడ్డ పోతారం మున్సిపాలిటీల జనాల కల్షొచ్చిండు. అట్లనే పార్టీల్ల శెరీకయ్యెటోళ్లను గూడ కండువాలు కప్పి జాయిన్ చేస్కుంటుండు.