మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, ఢిల్లీకి రేవంత్ !

తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై క్రిమినల్ కేసు ఉందని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటే బాంబు పేల్చారు. దీంతో ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీలోనే వెన్నుపోటు దారులు ఎవరూ అంటూ ఆరా తీస్తున్నట్లు సమాచారం.


Published Jun 10, 2026 01:44:11 PM
postImages/2026-06-10/1781079251_570475congress.webp

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమెపై నమోదైన క్రిమినల్ కేసు విషయాన్ని ఆమె తన అఫిడవిట్ లో పెట్టలేదని బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించి ఆమె నామినేషన్ పత్రాన్ని రిజక్ట్ చేశారు. దీంతో పాటు అటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సైతం కాంగ్రెస్ పార్టీలో కలవరపెడుతున్నాయి. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై క్రిమినల్ కేసు ఉందని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటే బాంబు పేల్చారు. దీంతో ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీలోనే వెన్నుపోటు దారులు ఎవరూ అంటూ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ ను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కావాలనే కుట్రతోనే రిజెక్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.

ఓ వైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురి కావడంతో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతోను సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మీనాక్షి నటరాజన్ పై కేసును కావాలనే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలే దాచి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్ మంత్రి కాంగ్రెస్ నేతలే లీకులు ఇచ్చారని చెప్పడంపై కూడా ఆయన హైకమాండ్ కు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

 

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress rahul-gandhi kc.venugopal raja-saab mallikharjunakharge sonia meenakshi-natarajan meenakshi-

Related Articles