రేవంత్ సార్. గిదంత కాస్సార్....మంత్రి పదవి వచ్చిందంటె గా మంత్రి పదవితో పాటు క్వార్టర్స్ ఇచ్చి..అంతటితోని ఆగొద్దు సార్. వాళ్ల ఖర్సులతో పాటు..కార్లతో పాటు ఒగ మీది మోటర్ గూడ ఇయ్యాలె. లేకుంటె తిప్పలైతయ్ సార్. మన సార్లు అందరు పెద్దోళ్లు గదా సార్. అందర్కి ఆసరా పింఛను తీస్కునే వయసొచ్చింది. కార్లల్ల కాన్వాయ్ లల్ల పోవుడు అయితదా శెప్పుర్రి. మల్ల మీదంగ గుంతల రోడ్లాయె. కేసీఆర్ సార్ పోశ్న రోడ్లే గదా. మరి వాళ్లు మాత్రం గా గుంతల్ల పోలేస్తరా. గందుకే...ఊ అంటె ఆ అంటె..మీది మోటర్ మీద బుర్రున గాల్లకు పోతుర్రు. కోమటిరెడ్డి సారు, పొంగులేటి సార్ లు ఊ అంటె ఆ అంటె మీది మోటరే తీస్తుండె. ఇగ ఉత్తమ్ సార్ ను సూడుర్రి.