ఐపీ పెట్టినోళ్లకు ఊళ్లె ఎవ్వలైన అప్పిస్తరానుల్ల. వంద రూపాలు కావాల్నన్నా..సాల్ సాల్ లే పో అంటరు. కనీ రేవంత్ సార్ చూశిర్రా. ఓ రేవంత్ సార్. ఎంత మంచోళ్లు సార్ మీరు. దివాళా తీశ్న కంపెనీకి వందలకు వందల కోట్లు వేలకు వేల కోట్ల కాంట్రాక్టులిస్తుర్రట గదా. ఐపీ పెట్టిన కంపిన్లని అమాంతం లేబట్టి మీదికి గుంజకొస్తుర్రట గదా. గదేంది సార్..గదేందో మీ బినామీ కంపెనీ అంటుర్రు. బినామీ కంపినీ గావట్టే..దివాళా తీశ్న కంపెనీకి వేలకు వేల కోట్ల కాంట్రాక్టులిస్తుర్రట నిజమేనా సార్. సారో..గిది నేనంటున్న మాట గాదు. కేటీఆర్ సారు ప్రూఫ్స్ తో వచ్చిండు సూడుర్రి.
అర్రే. సీఎం అయితె ఇంత పవర్ ఉంటదానుల్ల. ఐపీ పెట్టి ఆగమై పోతున్న కంపెనీని రెండు చేతుల్తోని లేవట్టి...సర్కార్ బలంతోని లేవట్టి...ఆరువేల కోట్ల కాంట్రాక్టులిచ్చిండట రేవంతు సారు. ఎన్నెన్నిచ్చిండో తెల్షా. అటు మెదక్ దిక్కు..ఇటు కోదాడ దిక్కు శాన పెద్దగనే ఉంది లిస్టు.